– ఆర్డిఓ కు వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
సిసిఐ ద్వారా కొనుగోలు చేసే పత్తి కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు లేకుండా చూడాలని బీఆర్ఎస్ నాయకులు సోమవారం ఆర్డిఓ రామూర్తికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం లో అనేక నిబంధన లు పెట్టడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు..వాతావరణ పరిస్థితిల మార్పుల వలన తేమ శాతం రావడం కష్టంగా మారుతుందని తెలిపారు. ఎకరానికి ఏడు కింటాళ్ల వరకే కొనుగోలు చేస్తాం అని నిబంధనలు సవరించాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్తాయి లో పత్తి పంటను ఆన్ లైన్ లో నమోదు చేయక పోవడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యలు పరిష్కారం చేసే విధంగా చూడాలని కోరారు.ఈ కార్యక్రమం లో బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జును రెడ్డి , సీనియర్ నాయకులు సూరంపల్లి పర్శరాములు, అయిలేని గాల్ రెడ్డి, బత్తుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
సిసిఐ కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



