నవతెలంగాణ – ముధోల్
నియోజక వర్గ కేంద్రమైన ముధోల్ లో గల తానూర్ బైపాస్ రోడ్డు ప్రక్కన గల హనుమాన్ మందిరం వద్ద బొగడ వాడకట్టు మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో 4 సీసీ కెమెరాలను బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గం మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు రోళ్ళ రమేశ్ మాట్లాడుతూ గత కొన్ని నెలల నుండి ముధోల్ లో చాలా దొంగతనాలు జరుగుతున్నాయని తెలిపారు. ముందు జాగ్రత్తగా చర్యగా సీసీ కెమెరాలు ఆలయంలో ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రోళ్ళ బాలాజీ, తెలుగాడం ధర్మన్న, హంగీర్గ లక్ష్మణ్, సంఘం మెంబర్లు వెంకటపురం పోతన్న, హంగీర్గ భోజన్న, భూమన్న,పోతన్న, గంగాధర్, సాయిలు, రాములు, సురేష్, ఈరన్న, సాయినాథ్, గంగాధర్, పోశెట్టి, శంకర్, దత్తు, తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్ ఆలయంలో సీసీ కేమెరాలు ఏర్పాటు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES