- Advertisement -
నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండలం కేశవపట్నంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో, మంగళవారం వినాయక మండపాల నిర్వాహకులకు పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా, హుజురాబాద్ రూరల్ సి.ఐ. పులి వెంకట్ మాట్లాడుతూ.. ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవడానికి ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే, విద్యుత్ అధికారి ఏ.ఈ. సంపత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు విద్యుత్ తీగల కింద వినాయక మండపాలను ఏర్పాటు చేయవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శేఖర్ రెడ్డి, పూజారి వెంకటేశ్వరరావు, మరియు పలువురు నిర్వాహకులు పాల్గొన్నారు.
- Advertisement -