Tuesday, September 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండపాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: ఎస్ఐ

మండపాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: ఎస్ఐ

- Advertisement -

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండల వ్యాప్తంగాప్రారంభం కాబోతున్న వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి మండపాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అని ఎస్ఐ అరుణ్ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లోమాట్లాడుతూ .. మండలంలో ప్రతి గ్రామంలో వినాయక మండపాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మండపాల దగ్గర ఎలాంటి మత ఘర్షణలు గాని అల్లర్లు గాని జరగకుండా ప్రత్యేకమైన శ్రద్ధ మండపాలు నిర్వహించే వ్యక్తులే చూసుకోవాలని అన్నారు. పెద్దపెద్ద  స్పీకర్లు పెట్టి ప్రజలకు ఇబ్బంది గురి చేయరాదని, ప్రశాంత వాతావరణం లో వినాయక చవితి పండగ జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల వినాయక చవితి మండపాలను నిర్వహించే వ్యక్తులకు ఉత్సవ కమిటీలకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -