- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయెల్, సిరియా నాయకులు ఇటీవల జరిగిన భారీ దాడుల తరువాత కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా రాయబారి టామ్ బారక్ వెల్లడించారు. ఈ ఒప్పందానికి టర్కీ, జోర్డాన్ దేశాలు కూడా మద్దతు తెలిపాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు, సిరియాలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కొత్త నాయకుడు అహ్మద్ అల్-షరా మధ్య ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని టామ్ బారక్ వెల్లడించారు. టామ్ బారక్ X ద్వారా డ్రూజ్, బెడౌయిన్, సున్నీలు ఇంకా ఇతర మైనారిటీలను ఉద్దేశించి.. ఆయుధాలు విసిరేసి, సిరియాలో శాంతి, ఐక్యతతో కొత్త గుర్తింపు ఏర్పరుచుకుందాం అని కోరారు.
- Advertisement -