సీపీఐ(ఎం) నాయకుల అరెస్టుపై ఆగ్రహం
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు : సీపీఐ (ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ- అబ్దుల్లాపూర్‌మెట్
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ అనాజ్‌పూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సీపీఐ(ఎం) నాయకుల అరెస్టులను ఖండిస్తూ భూపోరాట రైతులు ఆందోళన చేశారు. సీలింగ్ భూముల్లో రైతులకు పట్టా పాసుబుక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొంతకాలంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భూపోరాటం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవ్వడంతో ముందస్తుగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీని హైదరాబాద్‌లో పోలీసులు హౌస్ అరెస్టు చేయగా, రంగారెడ్డి జిల్లా నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నరసింహ, అనాజ్‌పూర్ గ్రామానికి చెందిన 15 మంది భూబాధిత రైతులను ఉదయాన్నే అరెస్టు చేశారు. దాంతో గ్రామంలో సీలింగ్ రైతులు, గ్రామస్తులు స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేశారు. అరెస్టు చేసిన నాయకులను, గ్రామస్తులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చివరకు అరెస్టు చేసిన వారిని విడుదల చేశారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నరసింహ అనాజ్‌పూర్ గ్రామానికి వచ్చి రైతులతో మాట్లాడారు. పార్టీ ఎటువంటి బంద్, ముట్టడి కార్యక్రమానికి పిలుపు ఇవ్వకున్నా కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో తమను అరెస్టు చేశారని తెలిపారు. రైతులందరికీ పట్టా పాస్ బుక్కులు వచ్చే వరకు అరెస్టులు, నిర్బంధాలు, కేసులు పెట్టినా భూపోరాటం ఆగదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని రైతులతో సంప్రదింపులు చేసి పట్టా పాసుబుక్కులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుమలత, నాయకులు బి.కనకయ్య, గుండె శివ, వర్గాల ముత్యాలు, కావలి జంగయ్య, చిర్ర శివకుమార్, ఎం.శ్రీశైలం, మాజీ ఉపసర్పంచ్ వరకాల బాలరాజ్, రైతులు, మహిళలు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) నేతల అరెస్ట్
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నారెడ్డిగూడలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్యను, జిల్లా కమిటీ సభ్యులు గోరెంకల నరసింహను తిప్పాయిగూడలో పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సామెల్, ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి బుగ్గరాములు, నాయకులు స్వప్న, అరుణ, యాదగిరి, దశరథ, భూపోరాట రైతులను అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్‌కు తరలించారు. యా చారం మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహతోపాటు పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు పి.అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు పి.బ్రహ్మయ్య, చందు నాయక్‌ను అరెస్టు చేసి గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్‌కు తరలించారు. కందుకూరులో పార్టీ నాయకులు బుట్టి బలరాజ్‌ను అరెస్టు చేశారు.
అనాజ్‌పూర్‌లో సీలింగ్ రైతుల ఆందోళన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES