క్రిస్మస్ వేడుకలు ఎమ్మెల్యే బిఎల్ఆర్
నవతెలంగాణ – మిర్యాలగూడ
పండుగలు సంతోషంగా జరుపుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కోరారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు విందు కార్యక్రమం స్థానిక ఏఆర్సి ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఒకరి పండుగలకు మరొకరు గౌరవిస్తూ సంతోషంగా పండుగలు జరుపుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుందని చెప్పారు. క్రిస్టియన్ల సమస్యల పరిష్కారం తోపాటు వారి అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. అనంతరం క్రిస్మస్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ నాయకులు క్రిస్టియన్ మత పెద్దలు పాల్గొన్నారు.
సంతోషాలతో పండుగలు జరుపుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



