- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
గణేష్ ఉత్సవాల పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ సంపత్ కుమార్ తెలిపారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో గణేష్ ఉత్సవాల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసిన నాటి నుండి నిమజ్జనం ముగిసే వరకు గొడవలు పడకుండా పండుగ జరుపుకోవాలని, విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీజే బాక్స్ లకు ఎలాంటి అనుమతి లేదని, మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిర్వాహకులు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఆంజనేయులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలయ్య, విద్యుత్ ఏఈ సంకీర్త, ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -