నిజామాబాద్ సాంస్కృతిక కళావేదిక.పిలుపు
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
2025 ఆగస్టు 22న ప్రపంచ జానపద కళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 23న నిజామాబాదులో నిజాం అంబేద్కర్ భవన్లో సాయంత్రం నాలుగు గంటలకు నిజాంబాద్ సాంస్కృతిక కళావేదిక ఆధ్వర్యంలో జానపద కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ సాంస్కృతిక కళా వేదిక జిల్లా అధ్యక్షులు సిరిప లింగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ తెలిపారు. 19 ఆగస్టు 2025 నిజామాబాద్ లో పెన్షనర్స్ భవన్లో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 23 ఆగస్టు తేదీన జానపద నృత్యాలు, సింధు, ఒగ్గు, కోలాటం, భజన, సుమారు 150 మంది కళాకారులతో కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. జానపద కళల రక్షణ కోసం కృషి చేస్తున్న వారికి అవార్డు నుంచి గౌరవించాలని వేదిక భావించిందని వారు ప్రకటించారు. ప్రజా కళలను రక్షించాలని, కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. ప్రజా కళలు సంస్కృతి సామాజిక అభివృద్ధికి దోదపడతాయని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద కళాకారులకు చేయూతనివ్వాలని వారు కోరారు. ఈ సమావేశంలో సాయిబాబా, గంగాధర్, రాధా కిషన్, నర్సారెడ్డి, చంద్రశేఖర్, పురుషోత్తం, విజయమాల,అంజన్న, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 23న ప్రపంచ జానపద ప్రదర్శనలను జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES