Monday, August 4, 2025
E-PAPER
Homeఖమ్మంప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని జయప్రదం చేయండి...

ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని జయప్రదం చేయండి…

- Advertisement -

పోలీసులు సివిల్ వివాదాల్లో  జోక్యం చేసుకోరాదు….
ఆదివాసి సేన నేత ఊకే రవి
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఈ నెల 9 వ తేదీ జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆదివాసి సేన రాష్ట్ర నేత ఊకే రవి గిరిజనులకు పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని వాగొడ్డుగూడెం లో సోందెం సుమన్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఊకె రవి పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఆదివాసి సేన సంఘం ఆధ్వర్యంలో వేసిన ఎల్.టి.ఆర్ కేసులపై గిరిజనులకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు వచ్చాయని వాటిని అమలు విషయంలో ప్రభుత్వ అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని, సర్వే నిర్వహించి ఆదివాసీలకు స్వాధీనం చేయాలని, పోలీసులు సివిల్ వివాదాల్లో తల దూర్చడం అన్యాయమని,  చట్ట ప్రకారంగా పనిచేస్తున్న సంఘ నాయకులను కొంతమంది బెదిరింపులకు గురి చేయడం,పోలీసులు గిరిజనేతరుల పక్షాన తిరిగి తప్పుడు కేసులు పెట్టడం అనేది సమంజసం కాదని,అది చట్ట విరుద్ధమని,వారికి ఆదివాసి సేన సంఘంగా అలాంటి వారికి తగిన బుద్ధి చట్ట ప్రకారంగా చెపుతుందని, అక్రమంగా ఏజెన్సీలో నివాసం ఉంటూ పిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోమని,తగిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ అధికారులు కూడా చట్ట ప్రకారంగా పనిచేయాలని లేనిపక్షంలో చట్టం రుచి ఏంటో మేమే చూపిస్తామని ,చట్ట విరుద్ధంగా పనిచేసిన ఏ ఒక్క అధికారిని కూడా,ఎక్కడకు బదిలీ అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని,చట్ట విరుద్ధంగా ఇబ్బందులు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా వదిలి పెట్టబోమని విడతల వారీగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.

అనంతరం జిల్లా కమిటీ సభ్యులు పాల్గొని నూతన అశ్వారావుపేట మండల కమిటీ,వాటి అనుబంధ కమిటీలు అయిన రైతు,కార్మిక,మహిళ,విద్యార్థి కమిటీని ఎన్నుకున్నారు. నూతన మండల కమిటీ అధ్యక్షులుగా కురసం బాబూరావు,అనుబంధం సంఘాలు అయిన మహిళా కమిటీ, రైతు కమిటీ కార్మిక కమిటీ,విద్యార్థి కమిటీ, వారితోపాటు 50 మంది కమిటీ లో సభ్యులను ఎన్నుకున్నారు.

ఆదివాసి సేన నాయకులు బేతి రమేష్,కణితి వెంకటేష్, ఆదివాసి సేన జిల్లా నాయకులు నాయకులు  పరిశీలనకు రాగా,నాయకులు వగెల వెంకటేష్,కోర్స సహదేవుడు,మహిళ నాయకురాలు బేతి నాగమ్మ, కుంజ పార్వతి, కొరస సునీత,మండల కమిటీ సభ్యులు కురుసం బాబురావు మండల అధ్యక్షులు,తురసం కృష్ణ ప్రధాన కార్యదర్శి ,కుంజ రామకృష్ణ సెక్రటరీ ,కోడి మే కన్నారావు వైస్ ప్రెసిడెంట్,కొర్రి రామకృష్ణ రైతు కమిటీ కన్వీనర్,పూనం రమేష్  జాయింట్ సెక్రెటరీ,కొరసా తిరుపతిరావు జాయింట్ సెక్రెటరీ,కురసం రాజు సెక్రటరీ,కొరసా సహదేవుడు కార్మిక కార్యదర్శి, మహిళా కమిటీ కన్వీనర్ బేతి నాగమ్మ, ప్రెసిడెంట్ విద్యార్థి కమిటీ సోడేమ్ సీతారాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -