నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ దేశాల ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆప్గాన్ రాజధాని కాబుల్‌లో పాక్ వైమానిక దాడులకు పాల్పడింది. ఆ తర్వాత గత శనివారం రాత్రి అనూహ్యంగా ఆఫ్గాన్ సైనిక క్యాంపులే లక్ష్యంగా ఆ దేశ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడింది. దీంతో అప్రమత్తమైన తాలిబన్ సేనలు..పాక్ సైన్యంపై ప్రతీదాడులకు దిగాయి. పాక్ సరిహద్దులోకి చొచ్చుకెళ్లి తాలిబన్ సైన్యం భీకర దాడులు చేసింది. దీంతో ఈ కాల్పుల్లో పాక్ సైనికులు దాదాపు 58 మంది చనిపోయారు. తాజాగా ఆఫ్ఘన్ లోని అనేక నగరాల్లో సాధారణ ప్రజలు తాలిబన్ సైనికులతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. ఆఫ్ఘన్ గడ్డపై పాకిస్థానీయుల చర్యలను తాము సహించలేమని సాధారణ ఆఫ్ఘన్ పౌరులు పేర్కొన్నారు. ఖోస్ట్, నంగర్హార్, పాకితా, పంజ్‌షీర్, కాబూల్‌లలో సంబరాలు మిన్నంటాయి. పూల దండాలు వేసి తాలిబన్ సేనలను సన్మానించారు.
ఆప్ఘనిస్థాన్‌లో సంబరాలు..ఎందుకంటే..?
- Advertisement -
- Advertisement -