Saturday, April 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

ఘంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
కంఠాలి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మాత్రే నాగనాథ్ మాహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా పూలే జీవితం చరిత్రను గ్రామస్తులకు సర్పంచ్ వివరించారు. సమాజంలో విద్యా ప్రాముఖ్యతను పెంచి, అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహానుభావుడు ఫూలే ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా అందరూ సంకల్పం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ బాబురావు , గ్రామ పెద్దలు, యువకులు భారీగా పాల్గొని నివాళులర్పించారు. “విద్యతో సమాజాన్ని మార్చిన మహాయోధుడు – మహాత్మ జ్యోతిరావు ఫూలే” వక్తలు పేర్కొన్నారు

– పలు గ్రామాలలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు: బిజ్జల్ వాడి గ్రామ సర్పంచ్ వాగ్మారే గంగా బాయి , సోపూర్ సర్పంచ్ తుకారం, సావర్ గావ్ సర్పంచ్ కపిల్ , ఖండేబల్లూర్ సర్పంచ్ చాకలి కృష్ణ, మహమ్మదా బాద్ సర్పంచ్ సుర్నార్ శకుంతల బాలు, గుల్లా తాండా సర్పంచ్ సుమతి యశ్పాల్, మందులా తాండా సర్పంచ్ అనితా మోహన్ , దోస్త్ పల్లి సర్పంచ్ మారుతి, జుక్కల్ సర్పంచ్ కర్రేవార్ సావిత్ర సాయ గౌడ్, బస్వాపూర్ సర్పంచ్ రమణ సురేష్ గొండ, చెండేగావ్ సర్పంచ్ బండేడ్ వార్ లక్ష్మన్, మాదాపూర్ సర్పంచ్ ఆశా పాటిల్, పెద్ద ఏడ్గి సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్, పెద్ద గుల్లా సర్పంచ్ మాదారావ్ దేశాయి, వజ్రఖండి సర్పంచ్ సింత్రాళే సావిత్రి , కత్తల్ వాడి సర్పంచ్ గోపాలరావు, నాగర్ గావ్ సర్పంచ్ జాదవ్ సునంద విజయ్ కుమార్, లొంగన్ సర్పంచ్ నాగల గిద్దే ఉషారాణి సదు పటేల్ , డోన్గాం సర్పంచ్ కే. శ్రీనివాస్, ఆధ్వర్యంలో ఆయా గ్రామాలలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -