Saturday, July 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పట్ల సంబరాలు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పట్ల సంబరాలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ లో స్థానిక సంస్థల ఎన్నికలలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలో తాడిచర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో శుక్రవారం సంబరాలు నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు అన్ని వర్గాలు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే న్యాయం జరుగుతుందని తెలిపారు.

ఇందుకు సాక్షాత్తు నిదర్శనమే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించడమన్నారు.  సామాజిక న్యాయం కోసం కృషి చేసిన  ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు, బిసి మంత్రి పొన్నం ప్రభాకర్ తోపాటు క్యాబినెట్ మంత్రి వర్గానికి ప్రత్యేక  ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్,రాజు నాయక్,మంత్రి రాజా సమ్మయ్య,అడ్వాల మహేష్,కోట రాజయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -