- Advertisement -
నవతెలంగాణ – ధర్మసాగర్
ప్రశాంత వాతావరణంలో దసరా ఉత్సవాలు జరుపుకోవాలని ధర్మసాగర్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.శ్రీధర్ రావు అన్నారు. ధర్మసాగర్ మండల పరిధిలోని గ్రామ పెద్దలందరికీ రాబోవు దసరా ఉత్సవాల సందర్భంగా ధర్మసాగర్ మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, బతుకమ్మ, దసరా పండుగను శాంతియుత వాతావరణం లో జరుపుకునేలా తగిన సూచనలు చేసినారు.మరియు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఎలాంటి జీవహింస చేయకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జాన్ పాషా,పోలీసులు, గ్రామ పెద్దలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -