తెలంగాణ హైకోర్టు జస్టీస్ మధుసూదన్ రావు..
రాష్ట్ర సైబర్ క్రైం అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్..
నవతెలంగాణ – వేములవాడ : దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనార్థం ఆదివారం వేములవాడకు విచ్చేసిన తెలంగాణ హైకోర్టు జస్టిస్ మధుసూదన్ రావుకి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారి కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు, అలాగే రాష్ట్ర సైబర్ క్రైం అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్ కు సాదర స్వాగతం పలికారు.వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. న్యాయమూర్తి శ్రీ లక్ష్మీ గణపతి దర్శనం, స్వామివారి దర్శనం, అమ్మవార్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేరువేరుగా ఆలయ అధికారులు అద్దాల మండపంలో ఆశీర్వచన ఏర్పాట్లు చేయగా, ఆలయ అర్చకులు, వేద పండితులు జస్టిస్ మధుసూదన్, రాష్ట్ర సైబర్ క్రైం అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్ లకు వేదోక్త ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సహాయ కార్య నిర్వహణ అధికారి బి శ్రీనివాస్ జస్టిస్ కి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. వారి వెంట ప్రోటోకాల్ సహాయ కార్యనిర్వహణాధికారి జి అశోక్, ఆలయ పర్యవేక్షకులు జి శ్రీనివాస్ శర్మ, నునుగొండ రాజేందర్, పురాణం వంశి మోహన్, గొట్టం గిరిబాబు, పట్టణ సీఐ వీరప్రసాద్ తోపాటు వివిధ శాఖల సిబ్బంది తదితరులు ఉన్నారు.
కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్న ప్రముఖులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES