Saturday, April 4, 2026
E-PAPER
Homeసినిమా'డెకాయిట్‌'కి సెన్సార్‌ ప్రశంసలు

‘డెకాయిట్‌’కి సెన్సార్‌ ప్రశంసలు

- Advertisement -

కథానాయకుడు అడివి శేష్‌ ఈనెల 10న ‘డెకాయిట్‌’ సినిమాతో థియేటర్లలోకి రాబోతున్నారు. పాన్‌-ఇండియా యాక్షన్‌-రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ చిత్రంతో షానియల్‌ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్‌ సరసన మణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించారు. అనురాగ్‌ కశ్యప్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో శేష్‌ తొలిసారిగా మాస్‌, రగ్గడ్‌ పాత్రలో కనిపించనున్నారు.
పోస్టర్లు, గ్లింప్స్‌, టీజర్‌, అలాగే ‘రుబారు’,’చిచ్చుబుడ్డి’ పాటలు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందుతూ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. ట్రూ బైలింగ్వల్‌ ప్రాజెక్ట్‌గా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా రెండు భాషల్లోనూ సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డ్‌ ఈ చిత్రానికి యూ/ ఏ సర్టిఫికేట్‌ ఇచ్చింది. సినిమా అద్భుతంగా ఉందని సెన్సార్‌ సభ్యులు మూవీ టీంని అభినందించారు.
అడివి శేష్‌ ఈసినిమాతో డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టబోతున్నారని మేకర్స్‌ తెలిపారు.
అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్‌ నారంగ్‌ సహ నిర్మాతగా వ్యవహరించారు.
ఈ చిత్రానికి భీమ్స్‌ బ్లాక్‌ బస్టర్‌ అల్బమ్‌ అందించారు. ధనుష్‌ భాస్కర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జ్ఞాని నేపథ్య సంగీతం సమకూర్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -