- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రూ.79,000 కోట్ల విలువైన మిలటరీ హార్డ్‌వేర్, ఆయుధాలను కొనుగోలు చేసే ప్రతిపాదనను కేంద్రం గురువారం ఆమోదించింది. సైన్యం యుద్ధ సామార్థ్యాన్ని బలోపేతం చేసే నాగ్ క్షిపణులు, యుద్ధనౌకలు, ఎలక్ట్రానిక్ నిఘా మరియు పర్యవేక్షణ వ్యవస్థలు ఉన్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన రక్షణ సముపార్జన మండలి (డిఎసి) సమావేశం ఈ ప్రతిపాదనను ఆమోదించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత సేకరణకు సంబంధించి ఇది రెండవ ప్రధాన నిర్ణయం. ఆగస్ట్ 5న రూ.67,000 కోట్ల విలువైన సేకరణ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. సుమారు రూ.79,000 కోట్ల మొత్తం వ్యయం అయ్యే వివిధ ప్రతిపాదనలను డిఎసి ఆమోదించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
- Advertisement -