Saturday, October 18, 2025
E-PAPER
Homeజాతీయం2027 జనాభా లెక్కలకు కేంద్రం సిద్ధం

2027 జనాభా లెక్కలకు కేంద్రం సిద్ధం

- Advertisement -

వచ్చే నెల నుంచే కసరత్తు
కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ

2027 జనాభా లెక్కలకు కేంద్రం సిద్ధమైంది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా వచ్చే నెల నుంచే ప్రారంభం కానున్నట్టు కేంద్ర హౌంమంత్రిత్వశాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

న్యూఢిల్లీ : 2027 జనాభా లెక్కలకు కేంద్రం సిద్ధమైంది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా వచ్చే నెల నుంచే ప్రారంభం కానున్నట్టు కేంద్ర హౌంమంత్రిత్వశాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2027 జనాభా లెక్కల మొదటి దశకు సంబంధించిన ముందస్తు సర్వే 2025 నవంబర్‌లో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రక్రియ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన నమూనా ప్రాంతాల్లో గృహ జాబితా, గృహ గణనను కవర్‌ చేస్తుంది. 2027 జనాభా లెక్కల మొదటి దశ కోసం చేపట్టిన ముందస్తు సర్వేను సులభతరం చేయడానికి 1948 జనాభా లెక్కల చట్టంలోని నిబంధనలను పొడిగిస్తూ నేడు హౌం వ్యవహారాల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. భారత రిజిస్ట్రార్‌ జనరల్‌, సెన్సన్‌ కమిషనర్‌ మృత్యుంజయ కుమార్‌ నారాయణ్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం 2027లో చేపట్టే జనాభా లెక్కలకు వచ్చే నెల నవంబర్‌ 10 నుంచి 30 వరకు ముందస్తు సర్వే చేపట్టనున్నట్టు తెలిపింది.

నివాసితులకు నవంబర్‌ 1 నుంచి 7వ తేదీ వరకు స్వీయ గణనకు అవకాశం కల్పించింది. ప్రధాన సర్వేకు ముందు వారు డిజిటల్‌గా సమాచారాన్ని ఇవ్వడానికి వీలు కల్పించింది. కాగా, 2027లో చేపట్టబోయే దేశవ్యాప్త జనాభా లెక్కల సేకరణకు ముందు ఈ ముందస్తు సర్వే చేపట్టడం ద్వారా కార్యాచరణలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కో వడానికి, పద్ధతులను మెరుగుపరచుకోవడానికి సహాయపడుతుందని మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. వచ్చే నెలలో చేపట్టబోయే ముందస్తు సర్వేలో పౌరులు చురుగ్గా పాల్గొనాలని నారాయణ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ ముంద స్తు సమగ్ర సర్వే నిజ జనాభా గణనకు దోహదపడుతుందని ఆయన అన్నారు. 2027లో రెండు దశల్లో జనాభా లెక్కలు నిర్వహించబడుతాయని, ఇందులో కులగణన కూడా చేపట్టనున్నట్టు కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -