- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, దేశీయంగా సామాన్యులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను ఇప్పట్లో పెంచేది లేదని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా రేట్లు పెరిగినా, ఆ నష్టాలను చమురు మార్కెటింగ్ సంస్థలే భరించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నిర్ణయంతో వాహనదారులకు భారీ ఊరట లభించింది.
- Advertisement -



