Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంయూరియా కొరతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం

యూరియా కొరతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం

- Advertisement -

ఎరువుల కోసం రైతుల పడరాని పాట్లు : సహకార కేంద్రం వద్ద బారులుతీరిన అన్నదాతలతో మాట్లాడిన జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ

రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులు తెలుసు కున్నారు. ఎంత యూరియా అవసరముంది.. ఇప్పటి వరకు వచ్చిన యూరియా ఎంత? ఇంకా ఎంత రావాలి.. అనే విషయాలను అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందుగా ప్రణాళిక వేసుకోకపోవడం, ఆ మేరకు యూరి యాను తెప్పించుకోవడంలో ప్రభుత్వం విఫలమైం దని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు యూరియా కేటా యింపు తగ్గించి రైతులకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. ఆయకట్టులో వరి పంట సాగు చేసి నెలరోజులు దాటిందని చెప్పారు. ఇప్పటి వరకు రెండుసార్లు యూరియా చల్లాల్సి ఉన్నప్పటికీ ఒక్కసారైనా చల్లలేదని తెలిపారు. యూరియా కొరత తీవ్రంగా ఉందని, దాని ఫలితంగా దిగుబడులు తగ్గే అవకాశం ఉందని అన్నారు. యూరియా కోసం రైతులు పగలు రాత్రి అని తేడా లేకుండా సొసైటీల వద్ద తిండి.. నీళ్లు మానేసి రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పంట వేసిన నాటి నుంచి పంట చేతికొచ్చాక అమ్ముకునే వరకు కూడా పోరాడాల్సి వస్తోందని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి అవసర మైన యూరియాను రైతులకు అందించాలని, లేనియెడల పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి రవినాయక్‌, టూటౌన్‌ కార్యదర్శి భావండ్ల పాండు, రైతు సంఘం నాయకులు నాగేశ్వరరావు నాయక్‌ తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad