Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రైతుల గోస పట్టించుకోని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

రైతుల గోస పట్టించుకోని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

- Advertisement -

తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి దూపసి పార్వతి..
నవతెలంగాణ – మల్హార్ రావు

రైతులకు సరిపడా యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైయ్యాని, రైతు గోస పట్టించుకోవడం లేదని తెలంగాణ ప్రజాప్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాసి పార్వతి విమర్శించారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. రైతులు యూరియా కోసం గంటల తరబడి లైన్లో నిలబడిన పూర్తిస్థాయిలో రైతులకు సరిపడా దొరకడం లేదన్నారు. ఒక లారీ లోడ్ రావడానికి వారం పట్టిందని, చ్చిన లారీ యూరియా రైతులకు ఏమాత్రం సరిపోలేదు ఒకటి రెండు బస్తాలతో సరిపెట్టుకున్న దొరకని రైతులు నిరాశతో  వెనుతిరిగి పోతున్నారని తెలిపారు. లారీ మల్లి వస్తదని చిట్టీలు ఇచ్చిన ఈ లారీ రావడానికి వారం పడతదో పది రోజులు పడుతదోని రైతుల నిరాశ చెందుతున్నారని పేర్కొన్నారు.

రైతులకు సరిపడా యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పూర్తి స్థాయిలో యూరియా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాకాల సీజన్లో రైతుల పంటలు ఎర్రబడి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, అయినప్పటికీ సరిపడా యూరియా అందించడం లేదన్నారు. జిల్లా ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేసి తక్షణమే ఈ కాటారం డివిజన్ ప్రాంత రైతులకు సకాలంలో లారీ వచ్చే విధంగా చర్యలు తీసుకొని మిగిలిన రైతులకు యూరియా పంపిణీ చేయాలని కోరారు. రైతులందరికీ యూరియా సరఫరా చేయాలని రైతులను ఈ విధంగా ఇబ్బంది చేస్తే రానున్న రోజుల్లో ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad