Tuesday, March 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలు ప్రజల్ని విస్మరించి సమస్యలను విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకులు

 ప్రజల్ని విస్మరించి సమస్యలను విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకులు

- Advertisement -

– ఇల్లందు మాజీ ఎం.ఎల్.ఏ. గుమ్మడి నర్సయ్య
– వ్యాపారం, ఆయుధాలను అమ్ముకోవడానికి అమెరికా ప్రపంచ దేశలా పై యుద్ధం చేస్తుంది
– అమెరికా సామ్రాజ్యం వాదంను దిక్కరించినందుకె ఇరాన్ పై యుద్ధం
– సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
నవతెలంగాణ – కామారెడ్డి : అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మొదటి మహా సభలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం, బుధవారం నిర్వహణలో భాగంగా మంగళవారం రాష్ట్ర మొదటి మహాసభలో ప్రారంభమయ్యాయి. ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించిన అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఇల్లందు మాజీ ఎం.ఎల్.ఏ. గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ ప్రజల్ని విస్మరించి సమస్యలను విస్మరిస్తున్న కేంద్ర,, రాష్ట్ర పాలకులు అని ఆయన అన్నారు. ప్రజలు ఎదురకొంటున్న సమస్యలను ఏమాత్రం పట్టించుకోక పోవడం సిగ్గుమాలిన పని అన్నారు. ధరలు పెరిగి పోయి, సమస్యలు సతమత మౌతున్న  పాలకులకు దున్నపోతుపై వడగండ్ల వాన పడ్డట్టు ఉంది అన్నారు. పోడుభూముల సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరేత్తినట్టుగా వ్యవహారించడం శోచనీయం అన్నారు. ఉపాధి హామీ పథకంను మార్చి వేసి వ్యవసాయ కూలీల పొట్టగొడుతున్నారు అన్నారు. వ్యాపారం, ఆయుధాలను అమ్ముకోవడానికి అమెరికా ప్రపంచ దేశలా పై యుద్ధం చేస్తుంది, అమెరికా సామ్రాజ్యం వాదంను దిక్కరించినందుకె ఇరాన్ పై యుద్ధం అని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. అమెరికా ప్రపంచ దేశాలపై తన పెత్తనం కోసం యుద్ధాలు చేస్తుంది అన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆయిల్  నిక్షేపాల కోసం తన ఆయుధాలను ఉపయోగిస్తూ బయబ్రాంతులకు గురి చేస్తు పెత్తనం చాలయిస్తుంది అన్నారు. దేశంలో అధికారంలో ఉన్న మోడీ అమెరికా బెదిరింపులకు దాసోహమై లొంగిపోయారు అన్నారు. వ్యవసాయ కార్మిక సమస్యల పరిష్కారం కోసం బలమైన పోరాటాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐపీకేఎంఎస్ సంఘం రాబోయే రోజుల్లో ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది అన్నారు.      
అకట్టుకున్న కళ ప్రదర్శనలు
పట్టణం లో జరిగిన ఎఐపికెఎంఎస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శన లో అరుణోదయ సంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటం, దప్పు నృత్యం, సైడ్ దప్పులు, చప్పట్లు పట్టణ వాసులను ఆకట్టు కున్నాయి. యుద్ధంకు కారకులు అయినా అమెరికా అధ్యక్షులు ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని నేతన్యూ ల వేసాధారణ తో ప్రజల్ని విశేషం గా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం లో ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్,  అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కృష్ణ, పి రామకృష్ణ టి యు సి ఐ రాష్ట్ర కార్యదర్శి ఆర్ రమేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కిషన్ రమేష్ టి యు సిఐ జిల్లా ఉపాధ్యక్షులు ప్రకాష్ సహాయ కార్యదర్శి అనీష్  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి కిషోర్ కోశాధికారి ఎస్ కిషోర్ పిడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి  జి సురేష్, జిల్లా నాయకులు శ్రీకాంత్ శ్రీనివాస్ కార్మిక నాయకులు పరమేష్, అంబన్న, ప్రసాద్ వేలాదిమంది కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -