నవ తెలంగాణ – హైదరాబాద్
ప్రభుత్వ రంగంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సేవల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు నెలల ఆర్థిక సాధికాతర వేగవంతం కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రీజనల్ ఆఫీస్ అలియాబాద్‌లో ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి కీలక సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వాటి ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆ బ్యాంక్ కార్పొరేట్ జనరల్ మేనేజర్ ఎడి శ్రీనివాస్, హైదరాబాద్ జోనల్ హెడ్ దారాసింగ్ నాయక్, రీజినల్ హెడ్ దిలీప్ కుమార్ భరణ్‌వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆర్థిక సాధికారతను ప్రోత్సహించేందుకు స్వయం సహాయక బృందాలకు రూ. 5,36,22,000 విలువైన చెక్కును అందజేశారు.
ప్రభుత్వ పథకాలపై సెంట్రల్ బ్యాంక్ అవగాహన క్యాంపెయిన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES