Wednesday, March 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ నీటి ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష

తెలంగాణ నీటి ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష

- Advertisement -

పునరావాసం తర్వాతే మూసీ బాధితులను తరలించాలి : సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ నీటి ప్రాజెక్ట్‌ల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆరోపించారు. మంగళవారం శాసనమండలి లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ కేంద్రంపై ఘాటైన విమర్శలు గుప్పించారు. బీజేపీయేతర రాష్ట్రాలకు కేంద్రం అన్నింటా అన్యాయం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డితో పాటు పలు ప్రాజెక్ట్‌లకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వినతిని మోడీ సర్కార్‌ బుట్ట దాఖలు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చిన హామీలను పకడ్బందిగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రూ.2లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌, ఫీజు రియింబర్స్‌మెంట్‌ తదితర అంశాలను గవర్నర్‌ ప్రసంగంలో ప్రస్తావించక పోవడాన్ని అయన తప్పుపట్టారు. మూసీని తాము స్వాగతిస్తున్నామనీ, అయితే పునరావాసం కల్పించిన తర్వాతే బాధితులను తరలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనీ, స్కీం వర్కర్లకు న్యాయం చేయాలని కోరారు. గత సర్కార్‌ హయాంలో మనబడి కార్యక్రమం కింద చేపట్టిన పనుల బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు చర్యలను వేగవంతం చేయాలనీ, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాలని కోరారు. ఫ్లోరైడ్‌ బాధిత నల్లగొండ జిల్లాలోని నీటి ప్రాజెక్ట్‌లను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -