Friday, April 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేంద్ర నిధులు మోడీ కరుణ కాదు..ప్రజల హక్కు

కేంద్ర నిధులు మోడీ కరుణ కాదు..ప్రజల హక్కు

- Advertisement -

కేరళంలో సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు
యూడీఎఫ్‌ మ్యానిఫెస్టో విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే నిధులు ప్రధాని మోడీ కరుణ కాదని.. అవి ప్రజల హక్కని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. అవినీతి నియంత్రణ, ఆదాయానికి గండిపెట్టే అంశాలను నియంత్రించడం, కేంద్ర పథకాల గరిష్ట వినియోగం, రాష్ట్రాలకు రావాల్సిన నిధుల సాధన అనేవి కాంగ్రెస్‌ ప్రాధాన్యతా అంశాలని ఆయన తెలిపారు. కేరళం శాసనసభ ఎన్నికల నేపథ్యంలో గురువారం అక్కడి కొచ్చిలో యూడీఎఫ్‌ మేనిఫెస్టోను సీఎం రేవంత్‌ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కేరళంలో యూడీఎఫ్‌ గ్యారంటీలు అమలు సాధ్యమా? అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని.. దానికి సమాధానం తెలంగాణ రాష్ట్రమేనని చెప్పారు. తమ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి క్యాబినెట్‌ సమావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ వృద్ధిరేటు 10.8 శాతంగా ఉందని, పన్నులు పెంచకుండానే అభివృద్ది సాధ్యమనే విషయాన్ని తాము నిరూపించామని వివరించారు.

క్రైస్తవులకు గుడ్‌ ఫ్రైడే శుభాకాంక్షలు : సీఎం ఎ.రేవంత్‌ రెడ్డి
రాష్ట్రంలోని క్రైస్తవులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి గుడ్‌ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు త్యాగం, ధైర్యం సీఎం గుర్తు చేసుకున్నారు. యేసుప్రభు ప్రేమ, కప కటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని అభిలషించారు. శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఇప్పటికీ, ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రపంచానికి ప్రేమ తత్వం బోధించిన దయామయుడు, సిలువపై యేసుక్రీస్తు త్యాగం మహోన్నతమైనదని ‘గుడ్‌ ఫ్రైడే’ సందేశం సందర్భంగా సీఎం వెల్లడించారు. యేసు క్రీస్తు త్యాగాలకు జ్ఞాపకంగా జరుపుకునే గుడ్‌ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదర, సోదరీమణులందరూ ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -