నవతెలంగాణ – అచ్చంపేట
తెలంగాణలో రైతులకు యూరియా బస్తాలు అందించడంలో కేంద్ర తీవ్రంగా విఫలం అయిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గం పర్వతాలు అన్నారు. గురువారం పట్టణంలో అచ్చంపేట సీపీఐ(ఎం) మండల పార్టీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ఎరువులు యూరియా బస్తాల కోట తగ్గించి రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. పండించిన పంటలను కొనడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నెలల తరబడి నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
మళ్లీ ఇప్పుడేమో ఎరువులు, యూరియా కోసం వారాలు, నెలలు తరబడి వేచి చూస్తున్న రైతుల బాధలు కేంద్ర ప్రభుత్వం అర్థం కావడం లేదని వారు విమర్శించారు. రైతే రాజు అని చెప్పి ప్రభుత్వాలు ఆచరణలో పెట్టడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విఫలం అయ్యింది అన్నారు. రైతులను మభ్యపెట్టి గద్దెనెక్కిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గాడి తప్పిందన్నారు. సమయానికి పంట పొలాలకు ఎరువులు, యూరియా వెయ్యకపోతే రైతులకు త్రీవ నష్టాలు వస్తాయన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతంగానికి ఎరువులు, యూరియా, విత్తనాలు పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్ దేశ నాయక్, సినియర్ నాయకులు శివకుమార్, దశరథo, మండల కార్యదర్శి వర్ధo సైదులు, రాములు, తదితరులు పాల్గొన్నారు.
రైతులకు యూరియాను అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం: సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES