Monday, September 29, 2025
E-PAPER
Homeజాతీయంజూబ్లీహిల్స్‌ బైపోల్‌కు కేంద్ర పరిశీలకులు

జూబ్లీహిల్స్‌ బైపోల్‌కు కేంద్ర పరిశీలకులు

- Advertisement -

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో సహా 8 రాష్ట్రాల్లో ఉపఎన్నికలకు 470 మంది అబ్జర్వర్లు
నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలోని జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో జరగనున్న ఉపఎన్నిక పర్యవేక్షణ కోసం ఎన్నికల సంఘం(ఈసీఐ) కేంద్ర పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు, ఎనిమిది రాష్ట్రాల్లో ఉపఎన్నికల కోసం మొత్తం 470 మంది సీనియర్‌ అధికారులను నియమించినట్టు వివరించింది. ఈ పరిశీలకుల్లో 320 మంది ఐఏఎస్‌, 60 మంది ఐపీఎస్‌, 90 మంది ఐఆర్‌ఎస్‌, ఐఆర్‌ఏఎస్‌, ఐసీఏఎస్‌ తదితర సేవలకు చెందిన వారు ఉన్నారు. వీరు ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయతను నిర్ధారించడమే లక్ష్యంగా పర్యవేక్షిస్తారు.

ఎన్నికల సమయంలో చట్టం, శాంతి భద్రతల పరిస్థితిని పరిశీలించేందుకు జనరల్‌, పోలీసు పరిశీలకులు వ్యవహరించగా, అభ్యర్థులు ఖర్చు చేసే ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేందుకు ఎక్స్పెండిచర్‌ పరిశీలకులను నియమించామని కమిషన్‌ వివరించింది. కేంద్ర పరిశీలకులు ఎన్నికల సంఘానికి సమయానుకూలంగా నివేదికలు పంపుతారని పేర్కొన్నది. ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణతో పాటు ఓటర్ల అవగాహన, పాల్గొనటానికి కూడా వారు సహకరించనున్నారు. తెలంగాణ (జూబ్లీహిల్స్‌), జమ్మూకాశ్మీర్‌ (బడ్గామ్‌, నాగ్రోటా), రాజస్తాన్‌ (ఆంటా), జార్ఖండ్‌ (ఘాట్షిలా), పంజాబ్‌ (తర్న్‌ తారన్‌), మిజోరాం (డంపా), ఒడిశా (నౌపాడా)లో జరగనున్న ఉపఎన్నికల్లో కూడా ఈ పరిశీలకులను నియమించినట్టు కమిషన్‌ వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -