Friday, September 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంయూరియా కొరతకు కేంద్ర విధానాలే కారణం

యూరియా కొరతకు కేంద్ర విధానాలే కారణం

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయాలి
అఖిలపక్షాన్ని కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి తేవాలి : నిరసనలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌

నవతెలంగాణ-ముషీరాబాద్‌
యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని, కేంద్రం వైఖరి మారకపోతే సమరశీల ఉద్యమాలు చేపట్టక తప్పదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ హెచ్చరించారు. గురువారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్యపార్క్‌ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన కోటా ప్రకారం యూరియా, ఎరువులను సరఫరా చేయలేదని విమర్శించారు. రసాయన ఎరువులపై సబ్సిడీని కేంద్రం క్రమంగా కోత పెడుతూ నానో యూరియాను బలవంతంగా మోపే ప్రయత్నం చేస్తోందన్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన యూరియాకు కూడా సరైన ఇండెంట్‌ వేయక పోవడం వల్లే ఈ సంక్షోభం వచ్చిందన్నారు. రాష్ట్రానికి వచ్చిన యూరియాను ప్రణాళికా బద్ధంగా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. అఖిలపక్షాన్ని కలుపు కుని కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాద్‌రావు మాట్లాడుతూ… గత నెల రోజులుగా రైతులు యూరియా సరఫరా కేంద్రాల వద్ద బారులు తీరి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్నండిందన్నారు. సకాలంలో ఎరువులు అందుబాటులో లేకపోతే పంటలు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందని, రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. కృత్రిమ కొరత సృష్టించి డీలర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారని, వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే వెంకటేష్‌, ఎస్‌.రమ, సహాయ కార్యదర్శి శ్రీకాంత్‌, సోమన్న, రాష్ట్ర నాయకులు రాధేశ్యాం, సునీత, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -