Tuesday, March 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

- Advertisement -

ఈ నెల 31న న్యూ డిల్లీలో అందజేత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మెన్‌ నందిని సిద్ధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2025 వరించింది. కోవిడ్‌-19 సమయంలో సమాజంలోని వేదన, భయం, మానవీయ కోణాలను వ్యక్తపరుస్తూ ఆయన రచించిన ‘అనిమేష’ గ్రంథానికి గాను ఈ అవార్డు దక్కింది. ఈ నెల 31న న్యూ ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డును అందజేయనున్నారు. తెలంగాణ సంస్కృతిని, అస్తిత్వాన్ని తన కలం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. మంజీరా రచయితల సంఘం స్థాపించి తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చారు. స్వరాష్ట్ర ఆకాంక్షను, ఆవశ్యకతను తన పాటల ద్వారా చాటుతూ తెలంగాణ ఉద్యమానికి గొప్ప ఊపునిచ్చారు.

నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్‌ నామోజు బాలాచారి, తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లభాపుర జనార్దన్‌, కె.ఆనందాచారి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ మట్టివాసన తెలిసిన కవిగా, తన సాహిత్యం ద్వారా తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసిన, తెలంగాణ గర్వించదగ్గ కవి, నందిని సిద్ధారెడ్డి అని కేసీఆర్‌ అన్నారు. ప్రముఖ రచయిత, ‘నాగేటి సాల్లళ్ల నా తెలంగాణ’ అంటూ తెలంగాణ ఆత్మను పలకరించిన అక్షర యోధుడు నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన అనిమేష కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులే ఇతివృత్తంగా దీన్ని రచించారు. నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి ఛైర్మన్‌గానూ పని చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -