నవతెలంగాణ- నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని వాడి, అక్కంపల్లి గ్రామాలలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను గురువారం రోజు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ జాతీయస్థాయి పర్యవేక్షక బృందం సభ్యులు సుధాకర్ రెడ్డి, లోహిత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు చేపడుతున్న కూలీలతో నేరుగా వారు సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీతో పాటు డ్వాక్రా సంఘాల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారు పేర్కొన్నారు. రెండు పథకాలను సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా ప్రతి మహిళ ముందుండే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
కేంద్ర రాష్ట్ర పథకాలను తెలంగాణ రాష్ట్రం సద్వినియోగం చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో గ్రామాలలో చేయబోయే పనుల ను గుర్తించి వాటికయ్యే వ్యయం ముందుగానే గ్రామపంచాయతీ నిధులలో జమ చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయ మని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుండి వినతులు రావడం జరిగిందని దానిని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనన్నట్లు వారు పేర్కొన్నారు. వారి వెంట ఏపీవో సాయిలు, ఏటీఎం జగదీష్, ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనులు పరిశీలించిన కేంద్ర బృందం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES