– వర్షాల నష్టాన్ని అంచనా
– అధికారుల నుంచి వివరాలు ఆరా
నవతెలంగాణ- హవేలీ ఘనపూర్/ నిజాంపేట/ కామారెడ్డి
సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు మెదక్, కామారెడ్డి జిల్లాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేం దుకు కేంద్ర బృందం బుధవారం ఆయా జిల్లాల్లో పర్యటించింది. మెదక్ జిల్లా నిజాంపేట, హవేలి ఘనపూర్ మండలాల్లో కేంద్ర బృందం పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. హవేలీ ఘనపూర్ పెద్ద చెరువు కట్ట, లింగాసాన్ పల్లి గ్రామంలో రోడ్డు, మెదక్ మండలంలోని మక్తభూపతిపూర్, తిమ్మానగర్ లో తెగిపోయిన రోడ్లను, కుంగిన బ్రిడ్జిలను పరిశీలిం చింది. అనంతరం నిజాంపేట మండలం నందిగామ గ్రామ శివారులో 765 డీజీ రోడ్డుపై కుంగిన బ్రిడ్జి, నస్కల్ రోడ్డులో తెగిన బ్రిడ్జిలను పరిశీలించారు. కుంగిన బ్రిడ్జిల వద్ద కాంట్రాక్టర్లు వరద ఉధృతిని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి కేంద్ర బృందానికి వివరిం చారు. నస్కల్ వెళ్లడానికి మల్కా చెరువు మత్తడి బ్రిడ్జి అతి ప్రాధాన్య సంతరించుకుందని తెలిపారు. రైస్ మిల్లులు, పౌల్ట్రీ ఫారాలు ఉన్నందున వ్యాపార లావా దేవీలకు చాలా ఇబ్బంది అవుతుందని బ్రిడ్జిని తొందర గా నిర్మించే విధంగా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టా లని కేంద్ర బృందానికి పలువురు తెలిపారు. స్పందిం చిన కేంద్ర బృందం.. బ్రిడ్జి పనులు ప్రారంభించేలా అధికారులకు సూచిస్తామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా కలిగిన నష్టాలను అంచనా వేయనున్నా మన్నారు. పర్యటనలో కేంద్ర బృంద సభ్యులు కేంద్రం బృంద సభ్యులు డాక్టర్ కే. పొన్ను స్వామి, వినోద్ కుమార్, అభిషేక్ కుమార్‌తోపాటు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్, ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఇమాద్, ఆర్‌అండ్‌బీ అధికారులు, ఎన్‌హెచ్‌ఏ అధికారులు ఉన్నారు.
కామారెడ్డి జిల్లాలో ఆగస్టు నెలలో సంభవించిన అధిక వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. ఆయా గ్రామాల్లో ధ్వంసమైన రోడ్లతో పాటు పంటపొలాల ను పరిశీలిస్తూ వివరాలు ఆరా తీశారు. కాగా ఆగస్టు లో వర్షాలు కురిసి నష్టాలు సంభవిస్తే.. అక్టోబర్‌లో పర్యటించడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా, జిల్లాలోని భిక్కనూర్ మండల కేంద్రంలోని దెబ్బతిన్న దాస్నమ్మకుంటను పరిశీలించి, అంతంపల్లి రోడ్డులో దెబ్బతిన్న పంచాయతీ రోడ్డు, గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. అనం తరం దెబ్బతిన్న బీబీపేట్ ఆర్ అండ్ బీ బ్రిడ్జిని పరిశీ లించారు. అనంతరం కామారెడ్డిలో జీఆర్ కాలనీ వద్ద దెబ్బతిన్న బ్రిడ్జిని, కామారెడ్డి ఫిల్టర్ బెడ్ పంప్ హౌస్ క్యాజ్ వే రోడ్డును పరిశీలించారు. అనంతరం వరద నష్టంపై కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా వ్యాప్తంగా రహదారులు, వంతెనలు, పంటలు, ఇరి గేషన్ ట్యాంకులు, విద్యుత్ లైన్లు, స్తంభాలు, ఇండ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. వాటిని తాత్కాలిక అత్య వసరంగా పునరుద్ధరణ చేపట్టామని వివరిం చారు. అనంతరం ఎల్లారెడ్డిలోని పెద్ద చెరువు కింద పంట పొలాలను పరిశీలించారు. నాగిరెడ్డిపేట్ మండలం లోని పోచారం డ్యామ్‌ను పరిశీలించారు. కాగా, పర్యటనకు వచ్చిన కేంద్ర బృందంలో.. హౌమ్ అఫైర్స్ జాయింట్ సెక్రెటరీ పీకే రారు నేతృత్వంలో ఎక్స్పెండిచర్స్ సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ డిప్యూటీ డైరెక్టర్ మహేష్ కుమార్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి శ్రీనివాసు బైరి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్సిఎస్ ) ఇస్రో డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ శశి వర్ధన్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రవి తేజ, ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్, ఆర్ అండ్ బీ ఈ మోహన్, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES