నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మధ్యాహ్న భోజన పథకాన్ని సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని కొడంగల్ నియోజకవర్గంలో అక్షయపాత్రకు ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ డిమాండ్ చేశారు. సోమవారం రోజున సెంట్రలైజ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని మధ్యాహ్న భోజన వంట కార్మికులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ హనుమంత రావు కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వంట కార్మికులుగా గత 23 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, వీరికి సరైన జీతాలు గాని ఇతర సౌకర్యాలు ఏమి కల్పించకుండా ప్రభుత్వము శ్రమ దోపిడీ చేస్తున్నాదని, నేటి ప్రభుత్వము సెంట్రలైజ్డ్అందజేశారు కిచెన్ పేరుతో అక్షయపాత్ర వారికి కోడంగల్ లో ఈ నెల 14న ప్రారంభించుటకు సన్నాహాలు చేస్తున్నారు.
అలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని నేడు రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ కలెక్టర్ల గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని, రాష్ట్రంలో 54, 200 మంది వంట కార్మికులుగా పనిచేస్తున్నారని, వీరి ఉపాధి పోయే ప్రమాదము ఉన్నది కావున ప్రభుత్వము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎప్పటికప్పుడు పిల్లలకు వేడివేడి భోజనం అందించాలని చెప్పినా, ప్రభుత్వం పట్టించుకోకుండా కార్మికుల పొట్టలు కొట్టే విధంగా ప్రైవేట్ వాళ్లకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుoదని అన్నారు. అలాంటి ప్రయత్నము విరమింపజేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఈనెల 24 నవంబర్ న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నమని, కార్మికులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా తరలిరావాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. వెంటనే ప్రభుత్వము స్పందించి కార్మికుల యొక్క హక్కులను కాపాడాలని ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని మేనిఫెస్టో పెట్టిన విధంగా పదివేల రూపాయలు ఇవ్వాలని ప్రతి నెల 5వ తేదీ లోపల బిల్లులు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బాగుల వసంత, జిల్లా ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బేగం, నాయకులు శ్యామ్, పారిజాత, స్వేత,పుష్ప, పూర్ణమా, రమ, వరలక్ష్మి, వరమ్మ, రూప, లక్ష్మి, కౌశల్య, సంతోష లు పాల్గొన్నారు.



