- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశ అత్యున్నత నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ తపన్ కుమార్ డేకా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో ఆయనకున్న అపార అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తపన్ డేకా 2026 జూన్ వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఐబీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆయన పదవీకాలాన్ని పొడిగించడం ఇది రెండోసారి.
- Advertisement -