బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 292/3
గాలె (శ్రీలంక) : బంగ్లాదేశ్ బ్యాటర్లు ముష్ఫీకర్ రహీమ్ (105 నాటౌట్, 186 బంతుల్లో 5 ఫోర్లు), కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (136 నాటౌట్, 260 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీలతో చెలరేగారు. ముష్ఫీకర్, శాంటో సెంచరీలతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 292/3 పరుగులు చేసింది. శ్రీలంకతో తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 45/3తో కష్టాల్లో పడింది. రత్నాయకె (2/124), ఫెర్నాండో (1/51) తొలి గంటలోనే మూడు వికెట్లు పడగొట్టి శ్రీలంకకు బ్రేక్ అందించారు. నజ్ముల్ శాంటో, ముష్ఫీకర్ రహీమ్ నాల్గో వికెట్‌కు అజేయంగా 247 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో తొలి రోజు ఆటలో బంగ్లాదేశ్ 90 ఓవర్లలో 3 వికెట్లకు 292 పరుగులు చేసింది. చివరి రెండు సెషన్లలో తిరుగులేని ఆధిపత్యం చూపించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతోంది.