Saturday, October 4, 2025
E-PAPER
Homeఆటలురాహుల్‌, జురెల్‌,జడేజా సెంచరీలు

రాహుల్‌, జురెల్‌,జడేజా సెంచరీలు

- Advertisement -

ఇండియా 448/5
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 162ఆలౌట్‌

అహ్మదాబాద్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా బ్యాటర్లు రాహుల్‌, జురెల్‌, జడేజా సెంచరీలతో కదం తొక్కారు. దీంతో రెండోరోజు ఆట ముగిసేసరికి టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది. దీంతో వెస్టిండీస్‌పై తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ను 162పరుగులకే పరిమితం చేసిన టీమిండియా.. అనంతరం భారత బ్యాటర్లు ముగ్గురు శతకాలతో రాణించడంతో 5వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. కెఎల్‌ రాహుల్‌(100), జురెల్‌(125)కి తోడు జడేజా(104నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నాడు. అనుభవం లేని కరీబియన్‌ బౌలింగ్‌ దళానికి చుక్కలు చూపించిన జురెల్‌, జడేజా జట్టు స్కోర్‌ను 400 దాటించారు. జురెల్‌ ఔటైనా వాషింగ్టస్‌ సుందర్‌(9 నాటౌట్‌) క్రీజులో కుదురుకోవడంతో రెండో రోజు ఆట ముగిసే సరికి గిల్‌ సేన 286 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(100), యశస్వీ జైస్వాల్‌ విండీస్‌ బౌలర్లను ఉతికేస్తూ గట్టి పునాది వేశారు. మొదటి వికెట్‌కు 68 పరుగులు రాబట్టిన ఈ ద్వయాన్ని జైడెన్‌ సీల్‌ విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన సాయిసుదర్శన్‌(7)ను రోస్టన్‌ ఛేజ్‌ ఎల్బీగా వెనక్కి పంపగా 90కే రెండు వికెట్లు పడ్డాయి. ఆదశలో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌(50), ధ్రువ్‌ జురెల్‌(125)అండగా ఇన్నింగ్స్‌ నిర్మించాడు రాహుల్‌. తనదైన షాట్లతో అలరించిన అతడు.. గిల్‌తో 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. గిల్‌ ఔటయ్యాక.. యువ వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌(125) సాయంతో చెలరేగిన రాహుల్‌ టెస్టుల్లో 11వ సెంచరీ సాధించాడు. వర్రికన్‌ ఓవర్లో రాహుల్‌ జస్టిన్‌ గ్రీవ్స్‌ చేతికి చిక్కడంతో.. ఎట్టకేలకు 218 వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది.

జురెల్‌, జడేజా ధనాధన్‌..
రిషభ్‌ పంత్‌ స్థానంలో తనకు దక్కిన అవకాశాన్ని వికెట్‌ కీపర్‌ జురెల్‌ వినియోగించు కుంటూ.. ధనాధన్‌ ఆటతో అలరించాడు. అతడికి రవీంద్ర జడేజా (104 నాటౌట్‌) తోడవ్వడంతో వెస్టిండీస్‌ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వీరిద్దరు బౌండరీలతో విరుచుకుపడుతూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. ఐదో వికెట్‌కు 206 పరుగులు జోడించి ఆధిక్యాన్ని పెంచారు. మూడో సెషన్‌లో జురెల్‌ ఔటైన కాసేపటికే జడ్డూ ఈ ఫార్మాట్‌లో ఆరో శతకం పూర్తి చేసుకున్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌ వికెట్ల నష్టానికి పరుగులు చేసిన భారత్‌ ఆధిక్యంతో మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలిచింది. వెస్టిండీస్‌ బౌలర్లు ఛేస్‌కు రెండు, పియరీ, వర్రెకన్‌, సీల్స్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.

స్కోర్‌బోర్డు…
ఇండియా తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి)హోప్‌ (బి)సీల్స్‌ 36, కెఎల్‌ రాహుల్‌ (సి)గ్రీవ్స్‌ (బి)వర్రికన్‌ 100, సాయిసుదర్శన్‌ (ఎల్‌బి)ఛేస్‌ 7, గిల్‌ (సి)గ్రీవ్స్‌ (బి)ఛేస్‌ 50, జురెల్‌ (సి)హోప్‌ (బి)పియరీ 125, జడేజా (బ్యాటింగ్‌) 104, సుందర్‌ (బ్యాటింగ్‌) 9, అదనం 17. (128ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 448పరుగులు.
వికెట్ల పతనం: 1/68, 2/90. 3/188, 4/218, 5/424
బౌలింగ్‌: సీల్స్‌ 19-2-53-1, లియనే 15-0-38-0, గ్రీవ్స్‌ 12-4-59-0, వర్రికన్‌ 29-5-102-1, పియిరీ 29-1-91-1, ఛేస్‌ 24-3-90-2.
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: క్యాంప్‌బెల్‌ (సి)జురెల్‌ (బి)బుమ్రా 8, చంద్రపాల్‌ (సి)జురెల్‌ (బి)సిరాజ్‌ 0, అథంజే (సి)రాహుల్‌ (బి)సిరాజ్‌ 12, కింగ్‌ (బి)సిరాజ్‌ 13, ఛేస్‌ (సి)జురెల్‌ (బి)సిరాజ్‌ 24, హోప్‌ (బి)కుల్దీప్‌ 26, గ్రీవ్స్‌ (బి)బుమ్రా 32, పియరీ (ఎల్‌బి)సుందర్‌ 11, వార్రికన్‌ (సి)జురెల్‌ (బి)కుల్దీప్‌ 8, జాన్‌ లయనె (బి)బుమ్రా 1, సీల్స్‌ (నాటౌట్‌) 6, అదనం 21. (44.1ఓవర్లలో ఆలౌట్‌) 162పరుగులు.
వికెట్ల పతనం: 1/12, 2/20, 3/39, 4/42, 5/90, 6/105, 7/144, 8/150, 9/153, 10/162
బౌలింగ్‌: బుమ్రా 14-3-42-3, సిరాజ్‌ 14-3-40-4, నితీశ్‌ రెడ్డి 4-1-16-0, జడేజా 3-0-15-0, కుల్దీప్‌ 6.1-0-25-2, సుందర్‌ 3-0-9-1.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -