Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా రెడ్ క్రాస్ కు ప్రశంసా పత్రం ..

జిల్లా రెడ్ క్రాస్ కు ప్రశంసా పత్రం ..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
క్షయ వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచినందుకు జిల్లా రెడ్ క్రాస్ కు ప్రశంసా పత్రం తో పాటు జిల్లా చైర్మన్ బుస్సా ఆంజనేయులుకు సన్మానం చేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం నుండి ప్రశంసా పత్రాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం అందజేశారు.  రాజశ్రీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ సభ్యులు టీవీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని విచితంగా ప్రజల్లోకి తీసుకెళ్లి టీబీ వ్యాధిగ్రస్తులకు అండగా నిలవాలని సూచించారు ఇటీవల జిల్లాలో సమీక్ష లో గౌరవ రాష్ట్ర గవర్నర్ టి బి ముక్తి భారత్ కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టాలని అన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్  అంకిత్ ఐఏఎస్, డాక్టర్ వి మనోహర్ రెడ్డి రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్ పి ఎం టి బి ముక్తి భారత్, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి రవీందర్ కార్యదర్శి అమర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -