Sunday, March 1, 2026
E-PAPER
Homeజిల్లాలుఎగ్జిబిషన్ లో నైపుణ్యం చాటిన స్టూడెంట్స్ కు ప్రశంసాపత్రాలు అందజేత

ఎగ్జిబిషన్ లో నైపుణ్యం చాటిన స్టూడెంట్స్ కు ప్రశంసాపత్రాలు అందజేత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఆదివారం సూర్యాపేట జిల్లా బాల్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టూడెంట్స్ ను సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ అభినందించారు. డ్రీమ్ యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ ఫైన్ ఆర్ట్స్ ఫౌండేషన్ ట్రస్ట్ ఫౌండర్, అధ్యక్షులు పి రమేష్ ఆధ్వర్యంలో విజయవాడ లోని తుమ్మలపల్లి క్షేత్ర కళాక్షేత్రంలో 13 వ నేషనల్ యంగ్ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ను 28న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు టీ డి జనార్దన్, ఆర్ డి విల్సన్, తేజస్వి పొడపాటి, గొల్ల నారాయణ రావు, జీ హిమబిందు, చంద్ర శేఖర్ గౌడ్ చేతుల మీదుగా సూర్యాపేట జిల్లా బాల్ భవన్ చిత్రలేఖనం గురువు దాసరి యల్లయ్యను ఘనంగా సన్మానించారు.

పలువురు స్టూడెంట్స్ ఎగ్జిబిషన్ కి తాము గీసిన చిత్రాలను ప్రదర్శన నిమిత్తం పంపించారు. వాటిల్లో యండి షగుఫ్త కు ఆల్ ఇండియా డ్రాయింగ్ అవార్డ్ వరించింది. యండి సభాఖానం, యు జాన్సన్, బి నందన్ కు గోల్డ్ మెడల్ లు, శశాంక్, పవన్, అక్షర, అభిరామ్ వర్మ కు సిల్వర్ మెడల్ లు వరించాయి. తెలంగాణ విద్యాశాఖ నిర్వహించే లోయర్ గ్రేడ్ పరీక్ష రాసిన రిజల్ట్ 28న విడుదలయ్యాయి. బాల్ భవన్ నందు శిక్షణ పొందిన స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ సాధించగా పలువురు మంచి నైపుణ్యం చాటారు. డ్రాయింగ్, టైలరింగ్ విభాగాల్లో ఈ సందర్భంగా స్టూడెంట్స్ ను అభినందిస్తూ.. ఎగ్జిబిషన్ లో నైపుణ్యం చాటిన స్టూడెంట్స్ కు ప్రశంసాపత్రాలను అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్ భవన్ సిబ్బంది ఉమ, సత్యనారాయణ సింగ్, అనిల్, సాయి, వీరు, స్టూడెంట్స్ , పేరెంట్స్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -