జిల్లా గ్రామీణ అభివృద్ధి కార్యాలయ అధికారి టి నాగిరెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జాతీయ పర్యాటక అభివృద్ధి సంస్థ హైదరాబాద్, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆరుగురు శిక్షణ పొందగా వారికి యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామీణ అభివృద్ధి కార్యాలయం ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా డిఆర్డిఓ నాగిరెడ్డి మాట్లాడుతూ.. వివిధ మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఈవెంట్ మేనేజ్మెంట్ శిక్షణ ఇచ్చినట్లు, ఈ శిక్షణ పొందిన 6 సభ్యులకు బ్యాంకు / శ్రీనిది ద్వారా రుణాలు ఇప్పించడానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను కూడా ఈ బృందాలకు అప్పగించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారా ప్రదానంగా క్యాటరింగ్ , మేనేజ్మెంట్, బ్యూటిషాన్ మరియు , సౌండ్ & లైటింగ్ మేనేజ్మెంట్, డెకరేషన్, ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ వంటి విభిన్న రంగాల్లో మహిళలు శిక్షణ పొంది తమ నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారు. ఏ రంగంలోనైనా ఏకాగ్రత, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే సమర్థత మహిళల్లో ప్రత్యేకత. అందువల్ల వారికి ప్రభుత్వం వివిధ పద్ధతుల్లో ప్రోత్సాహాలు అందిస్తూ బాసటగా నిలుస్తోంది. గ్రామీణా పేదరిక నిర్ముల సంస్థ , ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహిస్తూ బాసటగా నిలుస్తోంది.మహిళలు ఆర్దికంగా అభివృద్ధి చెండమే కాకుండా ఉపాది, వ్యాపార రంగాలలో పురుషులతో పాటు దీటుగా రానిస్తునారు.
ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి సృజనాత్మకత, ప్రణాళికా నైపుణ్యం అవసరమయ్యే రంగంలో అడుగుపెట్టడం ప్రత్యేకంగా అభినందనీయమైన విషయం. ఇందిరా మహిళా శక్తి కింద యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఆరుగురు సభ్యులు నవంబర్ 27 నుండి డిసెంబర్ 1 వరకు హైదరాబాదులోని – నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం & హాస్పిటాలిటీ లో ఈవెంట్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ శిక్షణ ద్వారా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు, యూనిట్‌గా ప్రాజెక్టుల నిర్వహణ, ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడానికి సిద్ధమవుతున్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తూ మరిన్ని మహిళా సంఘాలకు శిక్షణలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. శిక్షణ పొందిన 6 గురు సభ్యలకు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి నాగిరెడ్డి అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కే జంగా రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్ అందజేశారు.
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలలో భాగంగా హైదరాబాద్ లో శిక్షణ పొందిన 6 గురు మహిళకు పేదరిక నిర్మూలన సంస్థ – జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా వారి కార్యక్రమాల పెట్టుబడికి అవసరమైన రుణాలను బ్యాంకు ద్వారా ఇప్పించి వారికి కావాల్సిన సహాయ సహకారాలను అందించి మహిళా సాదికరికకు తోడ్పడులు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను కృషి చేస్తామన్నారు.



