Tuesday, August 5, 2025
E-PAPER
Homeజిల్లాలుతెలంగాణ వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గా సిహెచ్ ఆరతి

తెలంగాణ వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గా సిహెచ్ ఆరతి

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గా కంప్యూటర్ సైన్స్  ప్రొఫెసర్  సిహెచ్ ఆరతిని నియమిస్తూ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి మంగళవారం నియామకపు ఉత్తర్వులు అందించారు. అనంతరం రిజిస్ట్రార్ మాట్లాడుతూ గతంలో ప్రొఫెసర్ ఆరతి యూనివర్సిటీ లో అనేక అడ్మినిస్ట్రేటివ్ మరియు అకాడమిక్ పదవులను సమర్థవంతంగా, నిజాయితీగా నిర్వహించి అధికారుల మన్ననలు పొందినారని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి, బోధన బోధనేతర సిబ్బందిని  అధికారులను సమన్వయ పరుచుకుంటూ అంకితభావంతో పని చేస్తానని  హామీ ఇచ్చారు. తన మీద నమ్మకంతో నియామకపు ఉత్తర్వులు అందించిన వైస్ ఛాన్సలర్  ప్రొఫెసర్ టీ.యాదగిరిరావుకు, రిజిస్ట్రార్  ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -