Thursday, May 1, 2025
Homeఆటలుచాహల్‌ హ్యాట్రిక్‌

చాహల్‌ హ్యాట్రిక్‌

– ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన స్పిన్నర్‌
– చెన్నై సూపర్‌కింగ్స్‌ 190 ఆలౌట్‌

చెన్నై: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-18లో తొలి హ్యాట్రిక్‌ నమోదైంది. చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ స్పిన్నర్‌ యజ్ఞేంద్ర చాహల్‌ హ్యాట్రిక్‌ వికెట్లతో సత్తా చాటాడు. 18.4వ బంతికి ధోనీని ఔట్‌ చేసిన చాహల్‌.. ఆ తర్వాత రెండు బంతులకు దీపక్‌ హుడా, నూర్‌ అహ్మద్‌లను ఔట్‌ చేశాడు. దీంతో ఈ సీజన్‌లో తొలి హ్యాట్రిక్‌ సాధించిన బౌలర్‌గా చాహల్‌ నిలిచాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు రషీద్‌(11), మాత్రే(7), జడేజా(17) నిరాశపరిచారు. దీంతో చెన్నై 48పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో సామ్‌ కర్రన్‌(88), బ్రెవీస్‌(32) అద్భుత బ్యాటింగ్‌తో అలరించారు. వీరిద్దరూ 4వ వికెట్‌కు 78పరుగులు జతచేశారు. ఈ జోడీని అజ్మతుల్లా విడదీశాడు. ఆ తర్వాత సామ్‌ కర్రన్‌ లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్ల సాయంతో చెన్నై స్కోర్‌బోర్డును పరుగెత్తించాడు. ఆదుకుంటాడనుకున్న ధోనీ(11), హుడా(2) మరోసారి నిరాశపరిచారు. చెన్నై ఒక దశలో 200పరుగులకు పైగా పరుగులు చేస్తుందని భావించినా.. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లను చాహల్‌ వరుస ఓవర్లలో ఔట్‌ చేయడంతో చెన్నై ఇన్నింగ్స్‌ 190పరుగులకే ముగిసింది. పంజాబ్‌ బౌలర్లలో చాహల్‌కు నాలుగు, ఆర్ష్‌దీప్‌, జాన్సెన్‌కు రెండేసి, ఒమర్జరు, హర్‌ప్రీత్‌ బ్రార్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఈ సీజన్‌లో చెన్నై జట్టు నాకౌట్‌ బెర్త్‌ను దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి.
స్కోర్‌బోర్డు :
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రషీద్‌ (సి)శశాంక్‌ సింగ్‌ (బి)ఆర్ష్‌దీప్‌ 11, ఆయుష్‌ మాత్రే (సి)శ్రేయస్‌ అయ్యర్‌ (బి)జాన్సెన్‌ 7, సామ్‌ కర్రన్‌ (సి)ఇంగ్లిస్‌ (బి)జాన్సెన్‌ 88, జడేజా (సి)ఇంగ్లిస్‌ (బి)హర్‌ప్రీత్‌ బ్రార్‌ 17,
బ్రెవీస్‌ (బి)అజ్మతుల్లా 32, దూబే (సి)శశాంక్‌ సింగ్‌ (బి)ఆర్ష్‌దీప్‌ 6, ధోనీ (సి)వథేరా (బి)చాహల్‌ 11, హుడా (సి)ప్రియాన్షు ఆర్యా (బి)చాహల్‌ 2, కంబోజ్‌ (బి)చాహల్‌ 0, నూర్‌ అహ్మద్‌ (సి)జాన్సెన్‌ (బి)చాహల్‌ 0, ఖలీల్‌ అహ్మద్‌ (నాటౌట్‌) 0, అదనం 16. (19.2ఓవర్లలో ఆలౌట్‌) 190పరుగులు.
వికెట్ల పతనం: 1/21, 2/22, 3/48, 4/126, 5/172, 6/184, 7/186, 8/186, 9/186, 10/190
బౌలింగ్‌: ఆర్ష్‌దీప్‌ 3.2-0-25-2, జాన్సెన్‌ 4-0-30-2, ఒమర్జరు 4-0-39-1, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 2-0-21-1, చాహల్‌ 3-0-32-4, సూర్యాంశ్‌ షిండే 3-0-40-0.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img