శివ కందుకూరి హీరోగా హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వి పాపుడిప్పు నిర్మించిన చిత్రం ‘చాయ్ వాలా’. రాజీవ్ కనకాల, తేజు అశ్విని, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. వెంకట్ ఆర్ పాపుడిప్పు సహ నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందించారు. ఈ మూవీని ఫిబ్రవరి 6న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ కమిషనర్ సజ్జనార్, నీలోఫర్ ఫౌండర్ బాబురావు, కిమ్స్ ఎండీ రవి కిరణ్ వర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శివ కందుకూరి మాట్లాడుతూ,’ఈ మూవీలోని ఎమోషన్ అందరినీ కట్టి పడేస్తుంది. సిగ్గు వల్లో, భయం వల్లో ఇంట్లో చేయని సంభాషణ, బయటకు చూపించలేని ఎమోషన్ ఇందులో ఉంటుంది. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌లో రాజీవ్ కనకాల ప్రాణం పెట్టేశారు. అందరికీ కనెక్ట్ అయ్యే చిత్రం’ అని తెలిపారు.
‘ప్రశాంత్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. సురేష్ సాహిత్యం చక్కగా కుదిరింది. ఈ మూవీకి రాజీవ్ కనకాల ప్రాణం. శివ అదరగొట్టేశారు. నేను ఈ మూవీ విజయం పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను’ అని ప్రమోద్ హర్ష చెప్పారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ,’కొడుక్కి సపోర్ట్‌గా నిలిచే తీరులో రాజ్ కందుకూరికి హ్యాట్సాఫ్. తప్పొప్పుల్ని చెబుతూ శివని గొప్పగా గైడ్ చేస్తుంటారు. శ్రీనివాస్, కసిరెడ్డి అద్భుతంగా నటించారు. ప్రమోద్ చాలా మంచి వ్యక్తి. సినిమా కోసం చాలా కష్టపడుతుంటాడు. అద్భుతమైన కథతో గొప్పగా తీశారు. ఈ మూవీతో ప్రమోద్‌కి కచ్చితంగా విజయం దక్కుతుంది’ అని అన్నారు. సహ నిర్మాత వెంకట్ మాట్లాడుతూ,’ఫ్యామిలీ డ్రామాగా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. కథలోంచే ఈ టైటిల్ వచ్చింది. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్‌తో రానున్న ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది. ఫిబ్రవరి 6న అందరూ మా సినిమాను చూడండి’ అని అన్నారు.
‘చాయ్ వాలా’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



