Sunday, March 8, 2026
E-PAPER
Homeసమీక్ష'చైతన్య బావుట'-రావిరాల బుచ్చయ్య

‘చైతన్య బావుట’-రావిరాల బుచ్చయ్య

- Advertisement -

‘నా..’ అనే దాన్ని మరిచి, ‘మన’ అనే విశాల దక్పథంతో.. సమాజ మేలునే సదా కోరుకొనే వారు, వారి కోసమే నిత్యం ఆలోచనలు చేస్తుండేవారు, మంచి కోసమే కార్యాచరణలో ఉండే వారే నాయకులు అవుతారు. భారతదేశంలో ఎందరో నాయకులు తమ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వక, సదా సమాజ హితం కోసం నిరంతరం కషి చేశారు.
కానీ.. నేడు అవినీతి, బంధుప్రీతి, అధికార పీఠంపై వ్యామోహం గలవారై ప్రజల బాగోగులు పట్టించుకోక పైగా పళ్ళాలను, గంటలను కొట్టండి, కొవ్వత్తులు, దీపాలు వెలిగించండి, హోమాలు, యాగాలు చేయండని ఉచిత సలహాలిస్తూ, తనకు, తన బంధుమిత్రులకు దోచిపెట్టుకోవడంలో తలమునకలై యున్న నాయకులున్నారు.
సరిగ్గా ఇలాంటి ప్రభుత్వాలపై అక్షర తూటాలతో కూడిన కవితల ఆయుధాలతో ‘యుద్ధ బావుటా’ను ఎగరేస్తూ, ప్రజల పక్షం సదా నిలిచి కవిత్వం రాసేవారినే సచ్చీలురైన కవులు, రచయితలని అంటాం. వీరు సమాజ హితం కోసం సాహితీ సేద్యం చేస్తుంటారు.
ఇగో.. ఇలాంటి కోవకు చెందిన వారు సామాజానికి చైతన్యం నింపుతూ, తాను చైతన్యం నింపుకుంటారు, నూనుగు మీసకట్టు ఆరంభ వయసునే కలం పట్టి చిన్న కవితలు రాసిన మన ‘రావిరాల బుచ్చయ్య’.
75 కవితలతో సాహిత్య వినీలాకాశంలో ‘చైతన్య బావుటా’ కావ్యాన్ని ఎగరవేశారు. అందులో సగంపైగా కవితలు కరోన రక్కసి కర్కశత్వాన్ని ఏకరువు పెడుతూ, అదే అదునుతో పాలకుల, వైద్య మాఫియా అమానవీయత్వాన్ని చీల్చి చెండాడారు.
”ప్రకతిని పరిహసించిన,/ మానవుని మేధస్సుకు/ పెను సవాలుగా మారింది.”
‘కరోనా’ కవితలో.. అది ప్రపంచాన్ని అల్లకల్లోలానికి గురిచేసిందని, దాన్నెదుర్కోవాలంటే స్వీయనిర్భంధమే పదునైన ఆయుధమంటారు.
ఇంకా ‘కఠిన కాలం’ కవితలో.. ”ప్రాణ స్నేహితుడు/ పక్కనే నిలుచున్నా/ అనుమానించాల్సిన/ఆగత్యం దాపురించింది” అని కవి బాధపడుతారు.
‘ఆయుధం’ అనే కవిత్వంలో.. ”మత్యుంజయ యాగాలు/ ధన్వంతరి హోమాలు/ పండిత పూజారుల శ్లోకాలు/ భక్త శిఖామణుల ఉపవాసాలు” వంటి మానవుల మౌఢ్యాన్ని, అంధ విశ్వాసాలను కరోనా అపహస్యం చేస్తుంది” అంటూ నిజాన్ని తేటతెల్లం చేశారు.
”భూతప్రేత పిశాచాలను/ జుట్టుపట్టి ఈడ్చే/ మాంత్రికులేరి?/ రోగగ్రస్తులను/ తమ ప్రార్థనలతో/ తగ్గించే ప్లాస్టర్లు బ్రదర్స్‌ లేరి?/ భవిష్యత్తును గూర్చి/ బ్రహ్మాండంగా చెప్పగలిగిన/ జ్యోతిష్యలేమీ చేసిరి?/ నిత్యం పూజలందుకునే దేవుళ్ళు కిమ్మనకుండ గమ్మునున్నారేమిటి?”
యంటూ ‘ఏమిటి?’ కవితలో సూటిగా ప్రశ్నిస్తారు. ఇంకా ‘ఇదేమి జోస్యం’ లో ఎన్నికలు జరగాలని, కుంభమేళాలు నిర్వహించాలని రాజకీయ కుతంత్రాలోచన జేసిన నాయకులు, కత్రిమ కోరత సష్టించి ఆక్సిజన్‌, మందులను ఎక్కువ ధరకుమ్ముకొనే దళారులు వారి స్వార్థం, జనం ప్రాణాలతో.. ఆడుకోవటం, ఖాళీలేని స్మశాన వాటికల్లో గుట్టల్లా పేరుకపోతున్న శవాల దిబ్బలను సహితం పాలించాలనే కాంక్షలేమిటని? నిలదీస్తారు విప్లవవాది మన బుచ్చయ్య గారు.
”ముక్కులో ఒక సుక్క నిమ్మరసం/ చాలు అంటాడు ఒకడు/ పాలలో పసుపు కలిపి/ త్రాగాలంటాడొకడు/ తప్పక ఆవిరి పట్టాలంటాడు మరొకడు/ మత్యుంజయ మంత్రం పఠించి/ పదిమందికి పంపాలంటాడొకడు/ గోమూత్ర సేవనం సర్వరోగ నివారణం/ ఎహే.. ఆ కరోనా యెంత/ పారాసిటమాలుతో పోతది/ అంటాడో వేల పుస్తకాలు చదివిన పాలకుడు”
దీనితో తికమకయ్యి, పిచ్చి పట్టి చొక్కాలు చింపేసుకుంటున్నారు జనాలని ‘పిచ్చి’ మరియు ‘నవ్వాలో ఏడ్వాలో..!’ అనే కవితలలో, వ్యంగ్యంగా శాస్త్రీయ పరిజ్ఞానం లేని ముర్ఖులను విమర్శిస్తారు, అభ్యధయ బావాలు పుణికిపుచ్చుకున్న కవనమూర్తి రావిరాల గారు.
‘మానవుడే..’ మరో కవిత్వాన ఇంకో వంగ్యాస్త్రం ఇలా.. సంధిస్తారు.
”అత్యవసర సమావేశానికి/ అందరూ తప్పక హాజరు కావాలని/ బ్రహ్మ పంపిన నోటీసు/ నారదుల వారి ద్వారా/ దేవగణానికి చేరింది./ దేవేంద్రుని సభ మందిరంలో/ బ్రహ్మ అధ్యక్షతన/ కంటికి కనిపించకుండా/ ప్రాణాలను బలి తీసుకుంటున్న/ కరోనా మహమ్మారిని/ అంతమొందించడం ఎలా?/ అనే దానిపై తీవ్రమైన చర్చలు జరిగి ఏకాభిప్రాయం రాక, పైగా../ లాక్‌ డౌన్‌ లో/ మన ఆలయాలను మూసి/ ధూప దీప నేవేద్యాలను అంతంతమాత్రంగా../ అందిస్తున్న ప్రజలపై ఒకింత కోపాన్ని ప్రదర్శిస్తూ..,/ భయంకర కరోన సమస్యను నివారణకు ఒక నిర్ణయం చేయలేక/ మహా తెలివైనవాడు మానవుడే అని/ మంచో చెడో వాడే నిర్ణయంచుకుంటాడని చప్పట్లతో సభను ముగించారు.”
అలాగే.. ‘భోలేబాబా’ గారి ప్రవచనాలు, ప్రబోధాలు విని పోతున్న తొందరలో తొక్కిసలాట వందల మంది ప్రాణాల మీదికొచ్చుట, అయోద్య వంటి పుణ్య స్థలాల ఉత్తరప్రదేశ్‌ గడ్డ మీద జరిగిన సంఘటనతో అదొక మూఢనమ్మకాల అడ్డ అని తేలిపోయిందని ‘కాపాడండి’ కవితలో..
”ఈ దొంగ బాబాల/ నాటకాలకు తెరిదించలేరా?/ పాలక మహాశయులారా!/
ఇకనైనా బాబాలను నిషేదించి/ అమాయక పామరులను కాపాడండి.” యని కోరుతారు.
ఇంకా.. అడిగేవారు లేక ఏలికల ”అవినీతి కాళేశ్వరం కాలవలా ప్రవహిస్తుంది/ తెలంగాణ సమాజం బిత్తరపోయి చూస్తోంది.” అని ‘తెలంగాణ జనం’ కవితలో చెబుతారు.
”ప్రపంచ కార్మికులారా ఏకంకండి. పోరాడితే పోయేదేముంది,బానిస సంకెళ్లు తప్ప” అన్న ‘కారల్‌ మార్క్స్‌’ నినాదమును ఆదర్శంగా తీసుకొని ‘రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను’ రద్దు చేయాలని చేసిన పోరాట స్పూర్తిని ‘గొంతెత్తి జై కొట్టు’ అనే కవితలో.. స్పష్టంగా చెప్పారు.
విభిన్న రకాల వస్తు వైవిధ్యంతో సరళమై శైలితో వట్టిమర్తి గడ్డమట్టి వాసనలతో.. ‘చైతన్య బావుటా కావ్య కన్యను కన్న క్రీ.శే. రావిరాల గారికి ‘అశ్రునివాళి’తో.. సహదయ వందనాలు తెలియజేస్తున్నాను.
దాసరి శ్రీరాములు,
నాగార్జున సాగర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -