నవతెలంగాణ – ఢిల్లీ : ఢిల్లీలో చైతన్యానంద సరస్వతి అనే బాబాపై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ బాబాను ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. బాబా తమను లైంగికంగా వేధించాడంటూ ఆ కాలేజీలోని 17 మంది విద్యార్థినులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో దూషించడం, అభ్యంతరకర సందేశాలు పంపడంతో పాటు విదేశీ పర్యటన పేరుతో మభ్యపెట్టేవాడని వారు ఆరోపించారు. విచారణలో దాదాపు 32 మంది వాంగ్మూలం ఇవ్వగా.. అందులో 17 మంది బాబాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. వీటి ఆధారంగా ఆయనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో బాబా పరారయ్యాడు. ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఆగ్రాలోని ఓ హోటల్‌లో పట్టుకున్నారు. విచారణ అనంతరం కోర్టులో హజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
లైంగిక వేధింపుల ఆరోపణలు.. చైతన్యానంద సరస్వతి అరెస్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES