Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంరాజ్యాంగానికి సవాళ్లు

రాజ్యాంగానికి సవాళ్లు

- Advertisement -

– ప్రజాస్వామ్యంలో లోటుొ పార్లమెంట్‌కు అంతరాయాలూ నిరసనే
– సల్వాజుడుం తీర్పు నాది కాదు ొ కులగణన జరగాలి
– పీటీఐ ఇంటర్వ్యూలో జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి
న్యూఢిల్లీ :
దేశంలో ప్రజాస్వామ్యంలో లోటు నెలకొని వుందని, రాజ్యాంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఇండియా బ్లాక్‌ తరఫున బరిలో ఉన్న ఉప రాష్ట్రపతి అభ్యర్ధి బి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ఆయన ఈ సందర్భంగా ప్రతిన చేశారు. పీటీఐకి ఆయన శనివారం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేయడం దగ్గర నుంచి రాజ్యాంగం పీఠికలో సోషలిస్టు, సెక్యులర్‌ పదాలపై చర్చ, మావోయిజానికి తాను మద్దతిచ్చానం టూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన ఆరోపణల వరకు అనేక అంశాలను ఆయన ఈ ఇంటర్వ్యూలో వివరించారు. పార్లమెంట్‌లో అంతరాయాలు కూడా ఒక రకమైన నిరసనే అని, ఇవి ప్రజాస్వామ్యంలో కీలకమైనవని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇవి అంతర్భాగంగా మారకుండా జాగ్రత్తపడాలని ఆయన హెచ్చరించారు.

ప్రజాస్వామ్యంలో ఆలోచనల మధ్యే ఘర్షణ
గతంలో ఆర్థిక వ్యవస్థలో లోటు గురించి చర్చించేవారం, కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో లోటు గురించి మాట్లాడుకోవాల్సి వస్తోందని ఆయన అన్నారు. భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం కొనసాగుతున్నప్పటికీ, తీవ్రమైన ఒత్తిళ్లకు లోనవుతోందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం దాడికి గురవుతోందా లేదా అనే అంశంపై చర్చను ఆయన స్వాగతించారు. ప్రజాస్వామ్యమనేది వ్యక్తుల మధ్య ఘర్షణల గురించి కాదు, భావజాలాల మధ్య జరిగే ఘర్షణల గురించే ఎక్కువగా మాట్లాడుతుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్‌ (రిటైర్డ్‌) సుదర్శన్‌రెడ్డి వివరించారు. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సంబంధాలు మెరుగ్గా వుండాలని ఆయన ఆకాంక్షించారు. గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేసిన ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని సమర్ధిస్తూ ఇన్నేండ్లుగా తన ప్రయాణం కొనసాగిందని, ఒకవేళ అవకాశమిస్తే, రాజ్యాంగాన్ని పరిరక్షించే ప్రయాణంతో ముగుస్తుందని వ్యాఖ్యానించారు.

ఇంతకంటే గౌరవం ఏముంది?
ప్రతిపక్షాలు తనను ఏకగ్రీవంగా ఈ అభ్యర్థిత్వానికి ప్రతిపాదించడం గౌరవానికి సంబంధించిన విషయమని అన్నారు. 63-64 శాతం జనాభాకు వారు(ప్రతిపక్షాలు) ప్రాతినిధ్యం వహిస్తున్నారనీ, ఇంతకంటే గౌరవం ఏముంటుంది? అని ఆయన అన్నారు. జాతీయ ఐక్యతను ప్రతిబింబించేలా ఉన్నత రాజ్యాంగ పదవులను ఏకగ్రీవంగా భర్తీ చేయాలన్న వాదనపై మాట్లాడుతూ.. ‘ఏకగ్రీవంగా వుండాలనే నేను కూడా కోరుకుంటున్నా, కానీ రాజకీయ వ్యవస్థ అనేది విచ్ఛిన్నమైనది. ఇటువంటి పరిస్థితుల్లో బహుశా ఈ పోటీ అనివార్యం కావచ్చు.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
గతంలో మనం ఆర్థికవ్యవస్థలో లోటు గురించి మాట్లాడుకునేవారమనీ కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో లోటు గురించి మాట్లాడుకుంటున్నామని చెప్పారు. ”భారతదేశం ఇక ఎంతోకాలం ప్రజాస్వామ్య దేశంగా వుండలేదని నేననడం లేదు. ఆ అభిప్రాయాన్ని నేను సమర్ధించను కూడా. ఇప్పటికీ మనకు రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది, కానీ తీవ్రంగా ఒత్తిళ్లకు లోనవుతోంది” అని అన్నారు. గతంలో పాలకపక్షం, ప్రతిపక్షాలు అనేక జాతీయ సమస్యలపై సమన్వయంతో వ్యవహరించేవి, దురదృష్టవశాత్తూ, ఈనాడు అది కనిపించడం లేదని అన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక అంటే తనకు ఎన్డీఏ అభ్యర్ధి సిపి రాధాకృష్ణన్‌కి మధ్య పోటీ కాదని, రెండు భిన్నమైన భావజాలాల మధ్య పోటీ అని ఆయన వ్యాఖ్యానించారు. ”ఈ వ్యక్తి చాలా ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తి. ఇక నాకు సంబంధించినంత వరకు ఆ భావజాలాన్ని నేను సమర్ధించను.” అని ఆయన అన్నారు. సభా కార్యకలాపాలకు అంతరాయాలు కలిగించడం కూడా ఒక రకమైన అసమ్మతిని వ్యక్తం చేయడమేనని చెప్పారు.

సోషలిస్టు, సెక్యులర్‌ పదాలపై రాజ్యాంగం పీఠికలో సోషలిస్టు, సెక్యులర్‌ పదాలను చేర్చడంపై రేగిన వివాదంపై మాట్లాడుతూ, ఈ వ్యక్తీకరణలనేవి విషయాలను స్పష్టంగా చెప్పాయి. అలా కాకపోయినా ఇవి రాజ్యాంగంలోని నిబంధనల్లో అంతర్లీనంగా ఉంటాయని అన్నారు.

సల్వాజుడుంపై తీర్పు నాది కాదు
సల్వాజుడుంపై తీర్పు విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తనపై చేసిన ఆరోపణల గురించి మాట్లా డుతూ.. ”ఈ విషయంపై హోం మంత్రి తో నేరుగా ఘర్షణ పడాలని కోరుకోవడం లేదు. ఆ తీర్పును నేను రాశాను, కానీ ఆ తీర్పు నాది కాదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది. 40 పేజీల వరకు వున్న ఆ తీర్పును అమిత్‌ షా మొత్తంగా చదివితే బాగుంటుందని ఆయన ఆకాంక్షించారు. ఆ తీర్పును చదివివుంటే బహుశా ఆయన ఈ వ్యాఖ్యలు చేసేవారు కాదు, అదే నేను చెప్పాలనుకున్నది, ఇక ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేద్దాం. చర్చలో మర్యాద వుండాలి.” అని ఆయన పేర్కొన్నారు. కులగణన జరగాలని, దానికి మద్దతు ప్రకటిస్తున్నానని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad