ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఎనగందుల మొగిలిమాదిగ
నవతెలంగాణ – గోవిందరావుపేట
జిల్లాలోని వికలాంగులు వృద్ధులు వితంతువులు గీత చేనేత దీర్ఘాల వ్యాధికిస్తులు కొండలక్షినత రక్తహీనత పెన్షన్ హెచ్చింపు పై ఈనెల 8 న జిల్లా కలెక్టరేట్ను దిగ్బంధ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఎనగందుల మొగిలిమాదిగ డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని రంగాపురం ముద్దుల గూడెం గ్రామాల వితంతువులు వికలాంగులు గ్రామాలలో వికలాంగులకు వృద్ధులు వితంతువులకు కల్లుగీత కార్మికులకు చేనేత పెన్షన్దారులకు రక్తహీనత కండరాల క్షీణత బీడీ కార్మికుల వ్యాధి గ్రస్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టో ద్వారా బహిరంగ సభల లో ఏ హామీ అయితే ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్ విహెచ్పిఎస్, ఆరోగ్యశ్రీ పోరాట ఉద్యమాల వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణమాదిగన్న ఆదేశాల మేరకు చేయూత పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి నాయకులు బుర్రి వీరయ్య మాదిగ నేతృత్వంలో ప్రచారం జరిగింది.
ఈ సందర్భంగాఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఎనగందుల మొగిలిమాదిగ మాట్లాడుతూ ప్రచారం లో వికలాంగులు చేయూత పెన్షన్ థారుల హక్కుల పోరాట సమితి ముఖ్యంగా కల్లుగీత కార్మికులు నాయకురాలు కోసగాని లక్ష్మమ్మ పద్మశ్రీ మంద కృష్ణమాదిగన్న ఉద్యమ పోరాట కార్యాచరణ సన్నాహక చైతన్య ప్రచార కార్యక్రమంలో ముఖ్య అతిదులు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మ శ్రీ మందకృష్ణ మాదిగన్న ఉద్యమ పోరాటాలతోనే గతంలో పెన్షన్ హెచ్చింపు సాధ్యమైందని ఎల్లుండి సోమవారం రోజున చలో కలెక్టరేట్ ను ముట్టడి చేయాలని పిలుపునిస్తూ ప్రచారాన్ని వివరించారు.
గ్రామాలలో చేయూత పెన్షన్ దారులకు వికలాంగులకు పెన్షన్ హెచ్చింపు, నూతన పెన్షన్ దారులందరికీ పెన్షన్లు మంజూరు ఉద్యమ పోరాట కార్యచరణలో భాగంగా ఈ నెల 8 న సోమవారం రోజున జిల్లా కలెక్టరెట్ ముట్టడి లను జయప్రధం చేయుటకు మల్లేకట్ట గ్రామంలో విహెచ్పిఎస్ నాయకురాలు కోసగాని లచ్చమ్మ కడారి పూలమ్మ నదునూరి మొగిలి మాదిగ, లోలబొట్టు వెంకటేష్ ముదిరాజ్ పాల్గొనగాగీత కార్మికులు చేనేత కార్మికులు బీడీ కార్మికులకు పెన్షన్ పెంచుతామని, ఎన్నికల ముందు స్పష్టమైన హామీ, ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి బహిరంగ సభలలో వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి 21 నెలలు గడుస్తున్నా మాట్లాడని ప్రతిపక్ష పార్టి తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల పక్షాన, చేయూత పెన్షన్ దారుల పక్షాన పూర్తిగా విఫలమ య్యాయని ప్రజలకు పిలుపు నిచ్చారు.
వికలాంగుల హక్కుల పోరాట సమితి, చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి కల్లుగీత కార్మిక సంఘం నాయకురాలు కాసగాని లక్ష్మీ గౌడ్ పాల్గొనినారు వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు నాతిన ధనమ్మ ఎమ్మార్పీఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారూ.