పోరాటాన్ని జయప్రదం చేయండి
ఉపాధ్యాయ సంఘాల జెఎసి పిలుపు
నవతెలంగాణ – బోనకల్
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని, నూతన ఫెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత ఫెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, నూతన జాతీయ విద్యా విధానం 2020 ని రద్దుచేసి, శాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని జేఏసీ నాయకులు టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ పి ఆర్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు చింతల రవికుమార్ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల కేంద్రంలో చలో ఢిల్లీ పోస్టర్ ను సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శాసనమండలి ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగ ఉపాధ్యాయులకు పనికి తగ్గ మినిమమ్ టైమ్ స్కేల్ అందించాలని, పాఠశాలల విలీనం – మూసివేతలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని, ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించరాదని , బోధనకే పరిమితం చేయాలని, ఇన్కమ్ టాక్స్ స్లాబ్ రేట్లను సవరించాలనే తదితర డిమాండ్ల పరిష్కారం కోసం జాతీయస్థాయిలో అన్ని సంఘాలు కలిసి ఆల్ ఇండియా జాక్టో గా ఏర్పడి ఫిబ్రవరి -5వ తేదీన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఛలో ఢిల్లీ మార్చ్ టు పార్లమెంట్ పోరాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అత్యధిక సంఖ్యలో హాజరై పోరాటాన్ని జయప్రదం చేయాలని ఉపాధ్యాయ సంఘాల జిల్లా జెఎసి నాయకులు పిలుపునిచ్చారు.
మార్చి టు పార్లమెంట్ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఫెడరేషన్ జిల్లా కార్యాలయము నందు పోస్టర్ ఆవిష్కరణ చేసినట్లు తెలిపారు. మార్చి టు పార్లమెంట్ కార్యక్రమం ద్వారానైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా నాయకులు సద్దా బాబు, మండల అధ్యక్షులు గార్లపాటి చిన్న రంగారావు, మండల ఉపాధ్యక్షులు పి గోపాలరావు, పిఆర్టియు నాయకులు జి ఝాన్సీ, సోషల్ మీడియా కన్వీనర్ ఎం నరేంద్ర సింహ, మండల కోశాధికారి పి నరసింహారావు, కొంగర నరసింహారావు, కె సురేష్, ఎం నరేష్, విజయలక్ష్మి, జి పావని, మౌనిక, ప్రశాంత్, పి ఆర్ టి యు నాయకులు జి నాగేశ్వరరావు , మంజూష, టీఎస్ యుటిఎఫ్ నాయకులు కనకరాజు సత్యానందం, హరి, ఎం తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.



