– ఇందిరాపార్కు వద్ద మహాధర్నా : సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షులు సుర్వి యాదయ్యగౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మాజీ సర్పంచులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 18న చలో హైదరాబాద్ కార్యక్రమం తలపెట్టామనీ, ఇందిపార్కు ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహిస్తామని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షులు సుర్వి యాదయ్యగౌడ్ ప్రకటించారు. మాజీ సర్పంచులందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పెండింగ్ బిల్లులు విడుదల చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సర్పంచులు అప్పులు చేసి మరీ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే పదవీకాలం అయిపోయి ఏడాదిన్నర దాటినా ఇంకా బిల్లులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. మాజీ సర్పంచుల కుటుంబాలు అప్పులు, వడ్డీలు కట్టలేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని వాపోయారు. కొందరు మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, మరికొందరు గుండె పోట్లతో చనిపోయారని ప్రస్తావించారు. కార్యక్రమంలో జేఏసీ ఉపాధ్యక్షు లు మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, మాజీ సర్పంచులు మల్లయ్య, గణేష్, రవి, రవీందర్రావు, తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లుల కోసం 18న చలో హైదరాబాద్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES