Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఛలో హైదరాబాద్ కు తరలిరావాలి 

ఛలో హైదరాబాద్ కు తరలిరావాలి 

- Advertisement -

సీజేఐ పై దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్ పిలుపు
నిందితుడిని కఠినంగా శిక్షించాలి: సుబ్బారావు 
నవతెలంగాణ – పెద్దవంగర

సీజేఐ పై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, కోరుతూ నవంబర్ 1 నిర్వహించే ఛలో హైదరాబాద్ కు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంఛార్జి చిన్న సుబ్బారావు, ఎంఎస్పీ జిల్లా ఇంఛార్జి కందిపాటి బిక్షపతి పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని సాయి గార్డెన్ లో ఎంఎస్పీ మండల కన్వీనర్ ఈదురు సైదులు అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సీజేఐ పై దాడి చేసిన వ్యక్తిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు నవంబర్ 1 నిర్వహించే ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఎంఎస్పీ నాయకులు చిలుక సిద్దు మాదిగ, జలగం శ్రీనివాస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ చిన్నవంగర గ్రామ అధ్యక్షుడు రాంపాక ఐలయ్య, నాయకులు సందీప్, మహేష్, శ్యామ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -