Tuesday, September 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన కార్యవర్గం ఎన్నిక 

చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన కార్యవర్గం ఎన్నిక 

- Advertisement -

జిల్లా అధ్యక్షులుగా నిషిత రాజు, కార్యదర్శులు శ్రీనివాసరావు 
నవతెలంగాణ – కంఠేశ్వర్

నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 2025 – 27 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గం ఎన్నికలు స్థానిక శ్రద్ధానంద్ గంజు నందుగల మర్చంట్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు ఆర్ జగదీశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా 2025- 27వ సంవత్సరానికి గాను అధ్యక్షులుగా సి విజయ్ కుమార్ (నిషిత రాజు), ఉపాధ్యక్షులుగా కమల్ ఈ నాని, కార్యదర్శిగా వి. శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీగా గజవాడ గణేష్ గుప్తా, కోశాధికారిగా పడకంటి వినోద్ కుమార్, వారి కార్యవర్గ సభ్యులు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు హరిప్రసాద్, నర్సగౌడ్ లు తెలిపారు.

ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనునది అన్ని వ్యాపారవేత్తల సముదాయమని వారి కార్యచరణలో ఏర్పడే సమస్యలు, నూతన ప్రణాళికలు పరిష్కారణలకై ఏర్పడిన సంస్థ నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కమర్షియల్ ఇండస్ట్రీ అని అన్నారు. ఈ ఎన్నికలలో మాజీ అధ్యక్షులు మోటూరి దయానంద్ గుప్తా, ధర్మపురి సురేందర్, భక్తవత్సల్యం, శ్యాంసుందర్ అగర్వాల్ తదితరులతోపాటు అధిక సంఖ్యలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -