Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నిశిత రాజుకు ఘన సన్మానం

చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నిశిత రాజుకు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిశిత ఇంటర్నేషనల్ స్కూల్ లో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నిశిత రాజు ను శాలువ తో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. నిశిత రాజు చాలా సంవత్సరాలు గా నిజామాబాద్ జిల్లా వాసులకు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రస్తుతం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా అత్యున్నత పదవి లో నియామకం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ నగర్ గృహ వాసుల సంఘం ప్రధాన కార్యదర్షి బొబ్బిలి కిషన్, నాయకులు గణేష్, మహెంధర్, రాజు, లక్ష్మణ్, చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -